తామిద్దరం ప్రేమించుకుంటున్నామని ప్రకటించారు. అంతేకాదు, ఏడు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు కూడా. ఆ తర్వాత తిరిగి వచ్చి, తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు.

ఇద్దరు యువతులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వారిద్దరూ వరసకు వదిన, మరదళ్లు అవుతారు. చిన్న తనం నుంచి స్నేహంగా ఉండేవారు. దీంతో సాధారణ స్నేహమేనని కుటుంబసభ్యులు భావించారు. కానీ సడెన్ ట్విస్ట్ ఇచ్చారు. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని ప్రకటించారు. అంతేకాదు, ఏడు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు కూడా. ఆ తర్వాత తిరిగి వచ్చి, తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లా, బహ్ జోయ్ లో నివాసం ఉండే యువతి, తన మరదలితో కలిసి నోయిడాలోని ఓ కంపెనీలో పనిచేసేది. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. అంతే, ఇంట్లో వాళ్లకు చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

ఇటీవల ఆ ఇద్దరు బహ్ జోయ్ స్టేషన్ కి వచ్చి, తాము పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే,ముందుగా వారికి సర్దిచెప్పి, ఎవరింటికి వారిని పంపించినట్లు పోలీసులు తెలిపారు.