Encounter in Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
2 terrorists killed in Kupwara encounter: జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వివరాల్లోకెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా జిల్లాలో బుధవారం భద్రతా దళాలు- ఉగ్రవాదులకు మద్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. “ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది” అని ఆ అధికారి తెలిపారు. హతమైన ఉగ్రవాదుల గుర్తింపు, టెర్రరిస్టు గ్రూప్ అనుబంధ వివరాలు నిర్ధారించబడుతుందని అధికారి తెలిపారు.
కాగా, ఈ ఏడాది మార్చిలో పుల్వామాలోని మిత్రిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. అదేవిధంగా, ఫిబ్రవరిలో, పుల్వామా జిల్లాలోని స్థానిక మార్కెట్‌కు వెళుతున్న కాశ్మీరీ పండిట్ (సంజయ్ శర్మ)పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర కదలికలు పెరుగుతున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, గతంలో పోలిస్తే టెర్రరిస్టు చర్యలు ఇక్కడ తగ్గినట్టు తెలుస్తోంది.
