దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు వారు కన్నుమూశారు. కరోల్‌బాగ్‌ ప్రాంతంలోని అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ప్రమాదంలో 17మంది సజీవదహనమవ్వగా.. మృతుల్లో  ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు.అందులో ఒకరిది ఏపీ కాగా..మరొకరిది తెలంగాణ. 

విశాఖ నగరం ఏండాడ ప్రాంతానికి చెందిన మల్కాపురం హెచ్పీసీఎల్ డిప్యూటీ మేనేజర్ చలపతిరావు ఆ అగ్నిప్రమాదంలో చిక్కుకొని దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీలో జరిగే పెట్రోటెక్ సదస్సుకు హాజరయ్యేందుకు విశాఖ నుంచి వెళ్లిన ఆయన ఆ హోటల్ లో బస చేశారు. కాగా.. మంగళవవారం ఉదయం ప్రమాదవశాత్తు ఆ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

మొత్తం మృతులు 17మంది కాగా.. వారిలో ఒక స్త్రీ, మరో చిన్నారి కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కొందరు భవనంపై నుంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. కాగా.. మృతుల కుంబీకులకు ఢిల్లీ ప్రమాదం రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడం విశేషం. 
 
ఈ కేసులో దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది.  ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి ఇద్దరిని అరెస్టు చేశారు.  హోటల్ జనరల్ మేనేజర్ తోపాటు హోటల్ ఉద్యోగి ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.