దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు తెలుగు డాక్టర్లు అదృశ్యమయ్యారు. ఈ నెల 25వ తేదీన డాక్టర్ హిమ బిందు(29), డాక్టర్ దిలీప్ సత్య(28)లు మిస్సయ్యారు. కాగా... హిమందు భర్త డాక్టర్ శ్రీధర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... దిలీప్‌, హిమబిందు, శ్రీధర్‌ ఈ ముగ్గురు కర్నూల్‌ మెడికల్‌ కళాశాలలో కలిసి చదువుకున్నారు. చండీగఢ్‌లో  చిన్న పిల్లల వైద్యునిగా దిలీప్‌ పనిచేస్తున్నారు. ఈ నెల 24న పుదుచ్చేరిలోఇంటర్వ్యూకి వెళ్లి 25న తిరిగి వస్తుండగా ఢిల్లిలోని శ్రీధర్‌ దంపతుల ఇంట్లో ఆగారు. 

అనంతరం ఉదయం 11.30 నిమిషాల సమయంలో దిలీప్‌తో కలిసి చర్చికి వెళ్తున్నానని చెప్పి హిమబిందు, దిలీప్‌ బయటికి వెళ్లారు. కాసేపటి తరువాత ఇద్దరి మొబైల్‌ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ రావడంతో బిందు భర్త శ్రీధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఇద్దరి ఆచూకీ కనిపెట్టాలని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ , ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్లను అభ్యర్థించారు.