మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. ఇద్దరు అనుమానితులు కారులో వచ్చి ఈ పేలుళ్లకు పాల్పడ్డారని నివేదికలు తెలుపుతున్నాయి.
మొహాలీ : సోమవారం సాయంత్రం Mohaliలోని పంజాబ్ Polices intelligence officeపై దాడి జరిగింది. ఈ దాడి చేయడానికి ఉపయోగించిన రాకెట్‌తో నడిచే గ్రెనేడ్‌ను 80 మీటర్ల దూరం నుండి పేల్చినట్లు సంబంధిత వర్గాల సమాచారం.
ఈ పేలుళ్లకు సంబంధించి ఇద్దరు అనుమానితులు కారులో వచ్చి ఇంటెలిజెన్స్ కార్యాలయ భవనానికి 80 మీటర్ల దూరం నుండి ఆర్‌పిజిని ప్రయోగించారని నివేదికలు చెబుతున్నాయి. రాకెట్‌తో గ్రెనేడ్ తో ఓ లక్ష్యాన్ని పెట్టుకుని కాల్చలేదని, రాండమ్ గా కాల్చారని వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇంటెలిజెన్స్ అధికారులు, దర్యాప్తు అధికారులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
రాకెట్ లాంచర్‌ను డ్రోన్ ద్వారా డెలివరీ చేసి ఉండవచ్చని వర్గాలు తెలిపాయి. గత కొన్ని నెలలుగా, పాకిస్తాన్ నుండి పంజాబ్‌లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేయడానికి డ్రోన్‌ల వాడకం పెరిగింది.
నేపథ్యం
మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయం మూడో అంతస్తులో చిన్నపాటి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఆస్తులు దెబ్బతిన్నాయి. మొహాలీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్విందర్ సంధు ప్రకారం, భవనం వద్ద రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (RPG) లాబ్ చేయబడింది. దీనిపై విచారణ చేసేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక బృందాన్ని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపనుంది.
ఒక అధికారిక ప్రకటనలో, మొహాలీ పోలీసులు మాట్లాడుతూ, "సెక్టార్ 77, SAS నగర్‌లోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌లో రాత్రి 7.45 గంటలకు చిన్న పేలుడు సంభవించింది. ఎటువంటి నష్టం జరగలేదు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలను పిలిపించారు."
