జమ్మూ కాశ్మీర్ లో భద్రత బలగాలు చాకచక్యంగా ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు భద్రత బలగాలు తెలిపాయి. 

మంగళవారం అర్థరాత్రి దాటాక జమ్మూ లోని జవహర్ టన్నెల్ వద్ద ఈ ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. కాశ్మీర్ వైపుగా వస్తున్న ఒక ట్రక్కులో ఆయుధాలతో పాటు ఈ ఇద్దరు ప్రయాణిస్తున్నారని, వారిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్టుగా భద్రత బలగాలు తెలిపాయి. 

శ్రీనగర్ వైపుగా ట్రక్కులో ఆయుధాలను తరలిస్తున్నారన్న ఖచ్చితమైన సమాచారం ఉండడంతో అప్రమత్తుమైన భద్రత బలగాలు ఆ ట్రక్కును చేజ్ చేసి పట్టుకున్నాయి. ట్రక్కులో ఆయుధాలను గుర్తించిన అధికారులు డ్రైవర్, ఆ ట్రక్కులో ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

అరెస్టయిన ఇద్దరు అనుమానితులు కూడా దక్షిణ కాశ్మీర్ కి చెందినవార్తయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంతర్జీతీయ సరిహద్దు వద్ద ఆయుధాలను దాటించిన ఉగ్రవాదులు వీరికి వాటిని జమ్మూలో అందించి శ్రీనగర్ చేర్చవలిసిందిగా ఆదేశించినట్టు సమాచారం.