Asianet News TeluguAsianet News Telugu

కదులుతున్న కారులో గొంతునులిమి ఇద్దరు విద్యార్థుల హత్య.. మృతదేహాలను కాలువలోకి విసిరేసి...

యాభైవేల కోసం ఇద్దరు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేసిన దుండగులు.. వారిని కదులుతున్న కారులోనే గొంతు నులిమి చంపేశారు. ఆ తరువాత మృతదేహాలను వేర్వేరు చోట్ల కాలువలో పడేశారు.

two schoolboys killed in moving car, bodies dumped in canal near kolkata
Author
First Published Sep 7, 2022, 12:43 PM IST

కోల్‌కతా : రెండు వారాల క్రితం కిడ్నాప్‌కు గురైన ఇద్దరు  పాఠశాల విద్యార్థులు కోల్‌కతా సమీపంలోని ఓ రోడ్డు పక్కన గుంతలో శవాలుగా కనిపించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు సత్యేంద్ర చౌదరి సహా మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉంది. కేసు వివరాల్లోకి వెడితే.. ఆగస్ట్ 22న ఇద్దరు బాలురు కిడ్నాప్ అయ్యారు. అయితే దీనిమీద దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా అనుమానితులను విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

పాఠశాల విద్యార్థులు ఇద్దర్ని కిడ్నాప్ చేసిన వెంటనే హత్య చేశారని.. వారిని కదులుతున్న కారులోనే గొంతు నులిమి చంపేసి.. ఆ తరువాత పక్కనే ఉన్న కాలువలో పడవేసినట్లు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరు వెల్లడించాడు. ఈ సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఇద్దరు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతాలోని బగుయిహతి ప్రాంతం నుంచి అతాను డే, అభిషేక్ నస్కర్‌ అనే ఇద్దరు విద్యార్థులను నిందితులు కిడ్నాప్ చేశారు.

ఆ తరువాత అతాను కుటుంబ సభ్యులకు కిడ్నాప్ చేశామని, డబ్బులు కావాలంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే, పోలీసుల కథనం ప్రకారం, మరో చిన్నారి అభిషేక్ ను సాక్ష్యం లేకుండా చేయాలనే హత్య చేశారని తెలుస్తోంది. బైక్ కొనడానికి కావాల్సిన రూ. 50,000 కోసమే కిడ్నాప్‌ చేశారని పోలీసులు తెలిపారు. అయితే,  పోలీసులు సరైన టైంలో సరిగా స్పందించలేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని పోలీసులు కొట్టిపారేశారు.

భార్య‌ను చంపిన భ‌ర్త‌.. కొడుకుల‌పైనా దాడి.. ఆపై ఆత్మ‌హ‌త్య‌

వారు మాట్లాడుతూ "మా దర్యాప్తును మేం అన్ని కోణాల్లో ప్రారంభించాం. ఏ చిన్న క్లూ దొరికినా వదిలిపెట్టలేదు. కిడ్నాపర్లు కాల్స్ చేసినప్పటికీ బాధిత కుటుంబసభ్యులు వారితో సరిగా రిలేషన్ మెయింటేన్ చేయలేకపోయారు. ఈ కాల్స్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు మేము కూడా అలర్ట్ గా ఉన్నాం. జాగ్రత్తగా దర్యాప్తు చేస్తున్నాం" అని బిధాన్‌నగర్ పోలీసు బిశ్వజిత్ ఘోష్ తెలిపారు.

అరెస్టయిన నిందితుల్లో ఒకరు హత్య చేసినట్లు ఒప్పుకునే వరకు ఇద్దరు బాలురు చనిపోయారని తాము ఊహించలేదని పోలీసులు తెలిపారు. "మా విచారణలో భాగంగా అభిజిత్ బోస్‌ను అరెస్టు చేయడంతో కేసులో పురోగతి సాధ్యమయ్యింది. విచారణలో బోస్ మొత్తం చెప్పేశాడు. 22వ తేదీన సత్యేంద్ర, మరో ఇద్దరు ముగ్గురితో కలిసి కారులో వెడుతూ రాత్రి 8-10 గంటల మధ్య బసంతి హైవేపై పిల్లలను గొంతు కోసి చంపినట్లు ఒప్పుకున్నాడు.ఆ తరువాత హైవేపై రెండు వేర్వేరు ప్రదేశాల్లో రెండు మృతదేహాలను పడేసినట్లు అంగీకరించారు" అని ఘోష్ చెప్పారు.

చనిపోయిన అతాను, ప్రధాన నిందితుడు సత్యేంద్ర చౌదరి అంతకుముందే వీరు ఒకరికొకరు తెలుసు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు కోపంతో సత్యేంద్ర ఇంటిని ధ్వంసం చేశారు. ఇక తమ ఫిర్యాదుపై పోలీసులు సీరియస్‌గా వ్యవహరించలేదని కుటుంబీకులు చెబుతున్నారు. సహాయం కోరేందుకు తాను ముఖ్యమంత్రి నివాసానికి కూడా వెళ్లానని, అయితే భద్రతా సిబ్బంది అనుమతించలేదని అతాను డే తల్లి పేర్కొంది. 

కాగా, తమకు ఈ సమాచారం అందిన వెంటనే, గుర్తుతెలియని మృతదేహాలను కనుగొనడానికి బరుయ్‌పూర్, బసిర్‌హట్‌లలోని సౌత్ 24 పరగణాస్ పోలీసులతో విచారణ ప్రారంభించాం" అని ఘోష్ తెలిపారు. అయితే నిందితుడు నేరం ఒప్పుకోవడానికి ముందే విద్యార్థుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ, వాటిని గుర్తు తెలియని మృతదేహాలుగా గుర్తించి..  పోలీసు మార్చురీకి తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios