ఫ్లోరిడాలో రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోయారు. విమానాలు గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో ఇవి ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొని, కింద ఉన్న సరస్సులో పడిపోయాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 

సెంట్రల్ ఫ్లోరిడాలోని ఓ సరస్సుపై మంగళవారం మధ్యాహ్నం రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక విమానాన్ని పైపర్ జె -3 ఫ్లోట్ ప్లేన్ గా గుర్తించింది, కానీ మరొక విమానాన్ని గుర్తించలేకపోయారు. అయితే విమానాల్లో ఎంత మంది ఉన్నారు..? ఆ విమానాలు ఎక్కడ టేకాఫ్ అయ్యాయి ? ప్రమాదానికి కారణమేమిటి అనే వివరాలు తమకు తెలియలేదని అధికారులు తెలిపారు. 

మహిళలు, బాలికలపై ఉగ్రవాదుల దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్

విమానాలు కూలిపోయిన సరస్సు వింటర్ హెవెన్ ప్రాంతీయ విమానాశ్రయానికి ఆగ్నేయంగా ఉంది. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. ఫ్లోరిడాలోని ఓ సరస్సుపై రెండు విమానాలు ఒక దానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయని, తరువాత వెంటనే నీటిలో పడిపోయాయని తెలిపారు. ఓ విమానం రెక్కలు నీటికి అతుక్కుపోగా, మరో విమానం ఉపరితలం నుంచి 7 మీటర్ల లోతులోకి వెళ్లి స్థిరపడినట్లు అధికారులు తెలిపారు. 

ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల అరెస్టు.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

ఈ ప్రమాదంపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేస్తాయని పోల్క్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీవ్ లెస్టర్ మీడియా సమావేశంలో తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు మంగళవారం రాత్రి వింటర్ హెవెన్ లోని లేక్ హార్ట్రిడ్జ్ కోసం గాలిస్తున్నాయని చెప్పారు. రెస్క్యూ సిబ్బంది ఓ బాధితుడికి సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించారని, కానీ తరువాత అతడు మరణించినట్లు ప్రకటించారని ఆయన తెలిపారు. కాగా. ఓర్లాండోకు నైరుతి దిశలో 65 కిలోమీటర్ల దూరంలో వింటర్ హెవెన్ ఉంటుంది.