Mumbai: ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో మహిళను వేధించినందుకు నిందితులలో ఒకరైన నకిలీ డాక్టర్‌ని శనివారం అరెస్టు చేశారు. ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న నిందితుల్లో ఒకరికి ఎలాంటి మెడికల్ డిగ్రీ లేదని పోలీసుల విచారణలో తేలింది.
Fake doctor among 2 held for molesting patient: తన భార్యకు అనారోగ్యం ఉండటంతో స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రికి తీసుకెళ్లాడు ఒక భర్త. అయితే, అక్కడున్న వైద్యుడు సహా ఇద్దరు వైద్యం పేరుతో వేధింపులకు గురిచేయడం భర్త గమనించి నిలదీశాడు. పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడు ఆ వ్యక్తులు వైద్యులు కాదనీ, ఆసలు ఆ వ్యక్తికి ఎలాంటి మెడికల్ డిగ్రీ లేదని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయి పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని ముంబయిలో ఉన్న సబర్బన్ గోవండిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మహిళా రోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తన భార్య ఓపీడీకి దూరంగా ఉండటాన్ని గమనించిన బాధితురాలి భర్తకు అనుమానం రావడంతో ఏం జరిగిందనే విషయం గురించి ఆరా తీశాడు. డాక్టర్ వేషంలో ఉన్న నిందితుల్లో ఒకరిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయం గురించి బాధితురాలు జరిగిన ఆ విషయం చెప్పింది. వైద్యం పేరుతో ఆ నకిలీ డాక్టర్ లైంగిక వేధింపులకు గురిచేశారు. ఇది చూసిన ఆగ్రహానికి గురైన దంపతులు ఆస్పత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని గురించి వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న నిందితుల్లో ఒకరికి అవసరమైన వైద్య అర్హతలు లేవని విచారణలో తేలింది. దీంతో భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) లోని వివిధ సెక్షన్లతో పాటు మహారాష్ట్ర మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్టం-మహారాష్ట్ర నర్సింగ్ హోమ్ చట్టం కింద బోగస్ డాక్టర్, అతని సహచరుడిని అరెస్టు చేశారు. ఇదిలావుండగా, ఈ కేసులో ఇరుక్కున్న ఆసుపత్రి యజమాని ప్రస్తుతం అధికారుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారని సమాచారం.
