బెంగళూరు : కర్ణాటక సీఎం కుమార స్వామి, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జేడీఎస్ కేవలం ఒకే ఒక్క సీటు గెలవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు సోషల్ మీడియా వేదికగా తిట్టిపోశారు. 

సార్వత్రిక ఎన్నికల్లో సీఎం కుమార స్వామి తండ్రి దేవెగౌడ, తనయుడు నిఖిల్ లు పోటీ చేయడం ఇద్దరూ ఓటమిపాలవ్వడంపై వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కుమారస్వామి, కుటుంబ సభ్యులే టార్గెట్ గా అసభ్యకర పదజాలంతో విరుచుకుపడ్డారు.  

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సిధారాజు (26), చామా గౌడా (28)లను అరెస్ట్ చేశారు. వారు అప్ లోడ్ చేసి 32 సెకండ్ల నిడివి గల వీడియోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 406, 420, 499 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.