గుజరాత్ సరిహద్దుల్లో కుప్పకూలిన పాక్ ఎయిర్‌క్రాఫ్ట్: ఇద్దరు పైలట్లు దుర్మరణం
సోమవారం గుజరాత్ రాష్ట్రంలోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద పాక్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు.
సోమవారం గుజరాత్ రాష్ట్రంలోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద పాక్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు.
ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ డే రిహార్సల్స్‌లో భాగంగా ముష్షాక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ బయల్దేరిన కొద్దిసేపటికే గుజరాత్ సరిహద్దుల్లో కుప్పకూలినట్లు చెప్పింది. ఈ ఘటనలో పైలట్లు మేజర్ ఉమేర్, లెఫ్టినెంట్ ఫైజన్‌లు మరణించారు.
కాగా గత నెల 23న పాక్ ఎయిర్‌ఫోర్స్‌కే చెందిన ఎఫ్ 16 విమానం ఇస్లామాబాద్ శివార్లలోని షకర్పరియన్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ విమానం కూడా పాకిస్తాన్ డే రిహార్సల్స్‌లో భాగంగా గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ నౌమాన్ అక్రమ్ దుర్మరణం పాలయ్యారు. వరుస విమాన ప్రమాదాలపై పాకిస్తాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది.