త్రిపురలోని ఖౌవాయి జిల్లాలో అమానుషం జరిగింది. ఇద్దరు బాలికమీద 8మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఖటియాబరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం టూ వీలర్  మీద బైటికి వెళ్లారు. కొంతదూరం వెళ్లాక మరో ఆరుగురు, వేర్వేరు బండ్ల మీద వచ్చి వారితో కలిశారు. అందరూ కలిసి రాత్రి ఏడున్నర గంటల టైంలో బాలికలను దట్టమైన అడవిలోకి తీసుకెళ్లారు. 

అక్కడ ఎనిమిది మంది కలిసి వీరిమీద సామూహిక అత్యాచారం చేశారు. దీంతో బాధితులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అది చూసి భయపడిన నిందితులు అక్కడ్నంచి పరారయ్యారు. పోలీసులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లిన బాధితుల తల్లిదండ్రులు. దారుణమైన స్థితిలో ఉన్న చిన్నారులను చూసి కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారు. 

ఈ బాలికలను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యులు వేరే ఆస్పత్రికి సిఫార్సు చేశారు. నిందితుల మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.