ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మంగళవారం నాడు ఉదయం జరిగిన ఎ‘న్‌కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపినట్టుగా భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో తప్పించుకొన్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మంగళవారం నాడు పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. 

 సుక్మా జిల్లా కచాయగూడలో ఇవాళ ఉదయం ఎన్‌కౌంటర్ చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు. ఈ ఎన్ కౌంటర్‌లో ద్దరు మావోయిస్టులు మృతి చెందారు.గొంపాడ్ కన్నయ్యగూడ అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 

Scroll to load tweet…


మృతుల్లో కొంటా ఏరియా కమాండ్ కవాసి హుంగా కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో మావోయిస్టుల ఆయుధాలు,పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఎన్ కౌంటర్ నుండి కొందరు మావోయిస్టులు తప్పించుకొన్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.