Asianet News TeluguAsianet News Telugu

చైనా సరిహద్దులో ఇద్దరు భారత యువకులు అదృశ్యం.. కొనసాగుతున్న సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్

Arunachal Pradesh: భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లోకి వెళ్లిన ఇద్దరు అరుణాచల్ ప్రదేశ్ యువకులు అదృశ్యమయ్యారు. పోలీసులు ఆర్మీని సంప్రదించి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొన‌సాగిస్తున్నారు.
 

Two Indian youths missing Near China border; Ongoing search and rescue operation
Author
First Published Oct 15, 2022, 3:59 PM IST

India-China border: భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఇద్ద‌రు భార‌త యువ‌కులు క‌నిపించ‌కుండా పోయారు.  ఔషధ మొక్కలను వెతుక్కుంటూ వెళ్లిన ఇద్దరు అరుణాచల్ ప్రదేశ్ యువకులు అదృశ్యమయ్యారు. స్థానికులు ఈ విష‌యాన్ని పోలీసుల‌కు తెలిపారు. పోలీసులు ఆర్మీని సంప్రదించి వారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొన‌సాగిస్తున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. అక్టోబ‌ర్ 9న ఇద్ద‌రు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ యువ‌కులు ఔష‌ద మొక్క‌ల కోసం భార‌త్-చైనా స‌రిహ‌ద్దు ప్రాంతాల‌కు వెళ్లారు. అప్ప‌టి నుంచి వారు ఇంటికి తిరిగిరాలేదు. పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వచ్చింది. "వారి కుటుంబ సభ్యులు అక్టోబర్ 9న పోలీసుల ముందు తప్పిపోయిన ఫిర్యాదులు చేశారు. మేము ఆర్మీని సంప్రదించాము. వారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది" అని అంజావ్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)  రిక్ కమ్సి చెప్పారని ఏఎన్ఐ నివేదించింది. అయితే, దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివార‌లు తెలియాల్సి ఉంది. 

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ఎగువ సియాంగ్ జిల్లాలోని జిడో గ్రామానికి చెందిన 17 ఏళ్ల-అరుణాచల్ ప్రదేశ్ బాలుడు మీరమ్ టారోన్ ఈ ఏడాది జనవరి 18న అదృశ్యమయ్యాడు. చైనీస్ పీఎల్ఏ జనవరి 27న వాచా దమై వద్ద బాలుడిని భారత సైన్యానికి అప్పగించింది. అతన్ని PLA కిడ్నాప్ చేసి, వారం రోజుల తర్వాత విడుదల చేసింది. ఏఎన్ఐ ప్రకారం, మిరామ్ టారన్ తనను కొట్టారనీ,  విద్యుత్ షాక్‌లు ఇచ్చారని పేర్కొన్నారు. మిరామ్ తండ్రి ఒపాంగ్ టారోన్ ఒక వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ, ఈ సంఘటన మొత్తం తనను భయపెట్టిందని తన కొడుకు మానసికంగా, శ‌రీర‌కంగా కృంగిపోయాడ‌ని చెప్పారు. 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios