బెంగుళూరు: ఆస్తి కోసం మేనమామను కిడ్నాప్ చేయించిన కోడలు పోలీసులకు చిక్కింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు ఉత్తర తాలుకా హనియూరు గ్రామానికి చెందిన అంజన్ గౌడ కు అతని మేన కోడలు మౌనకు కొంతకాలంగా గొడవలున్నాయి.తనకు పుట్టింటి నుండి వచ్చిన ఆస్తి ఇవ్వాలని మామతో ఆమె గొడవ పెట్టుకొంది.     అంతేకాదు తాను ప్రేమించిన వ్యక్తి ఆమె ఇంటి నుండి వెళ్లిపోయింది.

అయితే తనకు తన మామ నుండి రావాల్సిన ఆస్తిని దక్కించుకొనేందుకు పక్కా పథకం రచించింది.మేనమామను కిడ్నాప్ చేయించేందుకు గాను మనోజ్ అనే యువకుడితో ఆమె ఒప్పందం చేసుకొంది.

అంజన్ గౌడ్ ను మనోజ్ బృందం కిడ్నాప్ చేసింది. ఈ నెల 22వ తేదీన దొడ్డబళ్లాపురం పోలీసులు నిందితులను వెంటాడారు.రాజానుకుంట సమీపంలో మౌన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును పోలీసులు అడ్డుకొన్నారు.

మనోజ్ సహా అతని స్నేహితులు పోలీసులు దాడి చేయడంతో రాజానుకుంట ఎస్ఐ శంకరప్ప గాయపడ్డారు.పోలీసుల కాల్పుల్లో మనోజ్ కాలికి గాయాలయ్యాయి. అంజన్ గౌడ్ ను పోలీసులు కిడ్నాపర్ల చెర నుండి విడిపించారు.మనోజ్ తో పాటు మౌనతో పాటు వీరికి సహకరించిన మిగిలినవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.