మహిళలను లైంగికంగా వేధించిన ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్ పోలీసులు నడిరోడ్డుపై గుంజీలు తీయించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భోపాల్: మహిళలను లైంగికంగా వేధించిన ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్ పోలీసులు నడిరోడ్డుపై గుంజీలు తీయించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ లో నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఇద్దరిని పోలీసులు కూర్చొబెట్టారు. భవిష్యత్తులో ఇలా చేయకుండా ఉండేందుకు గాను గుంజీలు తీయించారు.
మహిళలను వేధించిన నిందితులను ఓ మహిళా పోలీస్ లాఠీతొ కొట్టించింది. నిందితులపై పలు కేసులు ఉన్నట్టుగా కొత్వాలి పోలీస్ స్టేషన్ సీఐ ఉమ్రావ్ సింగ్ చెప్పారు.
దోపీడీ, దొంగతనంతో పాటు మహిళలపై పలు నేరాలు చేసిన కేసులున్నాయని ఆయన వివరించారు. నిందితులపై సీఆర్‌పీసీ సెక్షన్ 110 కింద పోలీసులు చర్యలు తీసుకొన్నారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూర్ 2019 నివేదిక ప్రకారంగా దేశంలో మహిళలపై నేరాలు 2018 కంటే 2019నాటికి పెరిగాయి. సుమారు 7.3 శాతం మహిళలపై నేరాలు పెరిగినట్టుగా రికార్డులు చెబుతున్నాయి.మహిళలపై నేరాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచింది. గత ఏడాది రాష్ట్రంలో మహిళలపై 27,360 కేసులు నమోదయ్యాయి.
