Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ సమీపంలో రెండు కార్గో షిప్‌లు ఢీ.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

గుజరాత్ సమీపంలో రెండు విదేశీ నౌకలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. గల్ఫ్ ఆఫ్ కచ్‌లో ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వెంటనే కోస్ట్ గార్డ్ టీమ్ రక్షక చర్యల్లో దిగింది. ఈ రెండు విదేశీ నౌకల నుంచి చమురు లీక్ కాలేదని తెలిసింది. అయినప్పటికీ కోస్ట్ గార్డ్ నుంచి నౌకలతోపాటు హెలికాప్టర్‌నూ రెస్క్యూ కోసం పంపారు.
 

two foreign ships collided near gujarat
Author
Ahmedabad, First Published Nov 27, 2021, 1:36 PM IST

న్యూఢిల్లీ: గుజరాత్ (Gujarat) సమీపంలో సముద్రంలో రెండు విదేశీ కార్గో షిప్‌(Cargo Ships)లు ఢీకొన్నాయి. ద్వారకా జిల్లా ఒఖా నుంచి పది మైళ్ల దూరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎంవీఎస్ ఏవియేటర్, అట్లాంటిక్ గ్రేస్‌ నౌకలు గల్ఫ్ ఆఫ్ కచ్‌లో ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి(Collided). ఈ ఘటన వివరాలు తెలియగానే కోస్ట్ గార్డ్ టీమ్ అప్రమత్తమైంది. ఒక పెట్రోలింగ్ షిప్‌తోపాటు ఓ హెలికాప్టర్‌ను ఘటనా స్థలానికి పంపించారు. ఈ ఘటనలో ప్రాణ హాని జరగలేదని తెలిసింది. కాగా, ఈ రెండు నౌకల నుంచి చమురు కూడా లీక్ అయినట్టు తెలిసింది. అయితే, పొల్యూషన్ కంట్రోల్ పడవ ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్టు గుజరాత్ డిఫెన్స్ పీఆర్‌వో పేర్కొంది. సముద్రంలో రసాయనాలు కలిస్తే వాటిని తొలగించడానికి ఈ నౌక పని చేస్తుంది. ఆ రెండు నౌకల పై ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు చెప్పారు. అయితే, సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు.

Also Read: ఈ షిప్ 2వేల కి.మీ దూరంలోని మిసైల్ ని కూడా ట్రాక్ చేస్తుంది.. భారతదేశానికి ఈ షిప్ ఎందుకు అవసరమో తెలుసా?

గత నెలలో ఇలాగే, పనామ జెండా పెట్టుకున్న ఎంవీ నేవియస్ వీనస్ అనే నౌక భారత దేశానికి చెందిన నౌకను ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమారు 17 మంది జాలర్లు గాయపడ్డారు. తమిళనాడులోని కొలాచెల్ కోస్ట్ నుంచి సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఢీ కొట్టిన తర్వాత కూడా ఆ ఎంవీ నేవియస్ వీనస్ నౌక ఏమీ జరగనట్టు ముందుకు కదిలిందని భారత నౌక సిజు మోన్-1 యజమానులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారిస్తూ ఆ నౌకను అదుపులోకి తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios