కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రోగ్రాం కోసం రెండు రోజుల డ్రై రన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, అస్సాం నాలుగు రాష్ట్రాల్లో ప్రారంభమవుతుంది. ఇమ్మునైజేషన్ తరువాతి పరిణామాలను ఎదుర్కోవడం, కోల్డ్ స్టోరేజ్, రవాణా ఏర్పాట్లను ఈ డ్రై రన్ లో సరిగ్గానే చేయగలమా లేదా అనేది చూస్తారు. ఈ డ్రై రన్ నాలుగు రాష్ట్రాల్లోని ఎన్నిక చేయబడిన జిల్లాల్లో నిర్వహిస్తారు. 

నాలుగు రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో నమోదు చేసిన పరిశీలనలను దీనికొరకు కేటాయించి కేంద్రానికి నివేదిస్తాయి. కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారుచేసేటప్పుడు మొదటి దశలో 30 కోట్ల మందికి రక్షణ కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇప్పటివరకు మొత్తం 2,360 శిక్షణా సమావేశాలు జరిగాయి, వైద్య అధికారులు, వ్యాక్సినేటర్లతో సహా 7,000 మంది అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌, కృష్ణ జిల్లాలో జరిగే డ్రై రన్ రాష్ట్రంలో ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలను, నిర్దేశించిన యంత్రాంగాలను పరీక్షించడమే లక్ష్యం అని ఆరోగ్య కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆదివారం విలేకరులతో అన్నారు.

"ఇది మాక్ డ్రిల్ లాంటిది. కార్యక్రమంలో ఎదురయ్యే అడ్డంకులు, ప్రతికూలతలు తెలుసుకోవడానికి దీన్ని నిర్వహిస్తున్నాం. అసలు డ్రైవ్ ప్రారంభానికి ముందు వీటిని పరిష్కరించుకోవడానికే ఇది’ అని భాస్కర్ అన్నారు. 

నాలుగు రాష్ట్రాల్లో, ఎంపిక చేయబడిన జిల్లాల్లో ఐదు సెషన్లు నిర్వహిస్తారు. ప్రతీ సెషన్లో ఆరోగ్య కార్యకర్తలు, ప్రీ ఐడెంటిఫైడ్ బెనిఫిషరీలను గుర్తించి కనీసం 25 మందికి ఇస్తారు. కో-విన్ సాధ్యాసాధ్యాలు, లబ్ధిదారులను గుర్తించే ఎలక్ట్రానిక్ అప్లికేషన్లు, కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్ వేయడానికి ముందు కావాల్సిన అవసరాలన్నింటినీ గుర్తిస్తారు. 

వాక్సిన్ వేసిన తరువాత ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోవడానికి  AEFI ప్యానెల్లు ఏర్పాటు చేస్తారు. టీకా వేసిన వెంటనే ఏదైనా రియాక్షన్ కనిపిస్తే వెంటనే ఈ ప్యానెల్స్ గుర్తిస్తాయి. 

"డ్రై రన్ తరువాత, స్టేట్ టాస్క్ ఫోర్స్ కోసం మేము ఒక నివేదికను సిద్ధం చేస్తాం, ఈ నివేదికలో డ్రైవ్ కి సంబంధించిన ఫీడ్ బ్యాక్ తో పాటు, తరువాత తీసుకోవాల్సిన చర్యల మీద తదుపరి మాకు మార్గనిర్దేశం చేస్తుంది" అని భాస్కర్ అన్నారు. ఈ నివేదికను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కూడా సమర్పించనున్నట్లు కమిషనర్ తెలిపారు.

అస్సాంలో, సోనిత్పూర్, నల్బరి అనే రెండు జిల్లాల్లో ఆరోగ్య శాఖ డ్రై రన్ చేస్తుంది. కోవిడ్ -19 టీకా ప్రక్రియ ఎండ్-టు-ఎండ్ పరీక్షలో రెండు జిల్లాల్లోని సైట్లకు వ్యాక్సిన్, లాజిస్టిక్స్ అన్నీ పంపించామని అధికారులు తెలిపారు. 
 
ఈ నెల ప్రారంభంలో కోవిద్ 19 వ్యాక్సిన్ల అత్యవసర వినియోగ అనుమతి కోరుతూ భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)లు ఫైజర్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కు దరఖాస్తు చేసుకున్నాయి.

భారతదేశం ఇప్పటివరకు 1.01 కోట్లకు పైగా కరోనావైరస్ కేసులను నమోదు అయ్యాయి. అమెరికా తరువాత అత్యధిక కేసులు నమోదైన రెండో దేశం భారత్. ఇప్పటివరకు వైరస్ బారిన పడి 1.47 లక్షల మందికి పైగా మరణించారు,