సీఎం ఇంటి వద్ద విధుల్లో ఉన్న ఇద్దరు మహిళా పోలీసులకు కరోనా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద విధుల్లో ఉన్న ఇద్దరు మహిళా పోలీసు ఆఫీసర్లకు కరోనా వైరస్ సోకింది.
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద విధుల్లో ఉన్న ఇద్దరు మహిళా పోలీసు ఆఫీసర్లకు కరోనా వైరస్ సోకింది.
సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్ష వద్ద వీరు బందోబస్తు డ్యూటీ నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన వారిలో ఒకరు అసిస్టెంట్ పోలీస్ ఇన్స్ పెక్టర్ కాగా, మరొకరు కానిస్టేబుల్ అని అధికారులు ప్రకటించారు.
వీరిద్దరూ రెండురోజుల పాటు సీఎం నివాసం వద్ద విధులు నిర్వహించారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ వచ్చినట్టుగా ఆదివారం నాడు తేలింది.
మలబార్ హిల్ బంగ్లాలో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెతో పాటు అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మరో ఆరుగురిని క్వారంటైన్ కు తరలించారు.
మలబార్ హిల్ ప్రాంతం దక్షిణ ముంబైలో ఉంది. ఈ ప్రాంతో పలువురు మంత్రులు, అధికారుల నివాసాలు ఉంటాయి. మంత్రులు, ఇతర ప్రముఖుల ఇళ్ల వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న పలువురు పోలీసులకు తరచుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
also read:కరోనా ఎఫెక్ట్: ఈ నెల 27వరకు సివిల్ ఏవియేషన్ ఆఫీస్ మూసివేత
మహారాష్ట్రలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విధించిన లాక్ డౌన్ సడలింపులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.