డిల్లీకి చెందిన రాజధాని ఎక్స్ ప్రెస్ ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ట్రక్కు డ్రైవర్ మరణించాడు. రైలు ప్రయాణికులెవరూ గాయపడలేదు. 

భోపాల్: డిల్లీకి చెందిన రాజధాని ఎక్స్ ప్రెస్ ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ట్రక్కు డ్రైవర్ మరణించాడు. రైలు ప్రయాణికులెవరూ గాయపడలేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝబువా జిల్లా తాండ్లా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగినప్పుడు రోడ్డు ట్రాఫిక్ ను నిలువరించడానికి క్రాసింగ్ ను మూసేశారు. ప్రమాదంలో గాయపడిన ట్రక్కు డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించాడు. ట్రక్కు ధ్వంసమైంది.

పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణికులను ఇతర బోగీల్లో సర్దుబాటు చేశారు. రెండు బోగీలను తప్పించిన తర్వాత రైలు ముందుకు సాగింది. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. 

ప్రమాదం గురువారం ఉదయం 6.44 గంటలకు జరిగింది. ట్రక్క్ క్రాసింగ్ ను బ్రేక్ చేసి రాజధాని ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొట్టింది.

Scroll to load tweet…