Asianet News TeluguAsianet News Telugu

భారత్‌లో మరో కొత్త రకం కరోనా: యూపీలో వెలుగు చూసిన 'కప్పా వేరియంట్', ఇద్దరికి నిర్థారణ

భారత్‌లో కప్పా వేరియెంట్ పేరిట కొత్త రకం కరోనాను నిపుణులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లో దీనికి సంబంధించి రెండు కేసులు బయటపడ్డాయి. దీనికి త్వరగా వ్యాప్తి చెందే లక్షణం వుందని వైద్యులు చెబుతున్నారు. 
 

Two Cases Of Kappa Covid Variant Detected In Uttar Pradesh ksp
Author
Lucknow, First Published Jul 9, 2021, 4:05 PM IST


ఇప్పటికే సెకండ్ వేవ్ దెబ్బకు భారతదేశం వణికిపోయింది. ఇది చాలదన్నట్లు వైరస్‌కు అనుబంధంగా బ్లాక్, ఏల్లో, గ్రీన్, వైట్ ఫంగస్‌లు జనాలను ఠారెత్తించాయి. ఇక భారత్‌లో పుట్టిన కరోనా డెల్టా వేరియంట్ ఇతర దేశాలకు విస్తరించి ఇప్పుడు అక్కడ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే, కరోనా వైరస్ ఎప్పటికప్పుడు జన్యు ఉత్పరివర్తనాలకు గురవుతూ కొత్త రూపం సంతరించుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్‌లో కొత్తగా ‘‘కప్పా’’ వేరియెంట్‌ను నిపుణులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు కరోనా పాజిటివ్ కేసుల్లో కొత్త వేరియంట్ ను గుర్తించారు. ఇది త్వరగా వ్యాపించే లక్షణమున్న వేరియంట్ అని అని నిపుణులు చెబుతున్నారు.

Also Read:కేరళలో జికా వైరస్... పెరుగుతున్న కేసులు..?

లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ కాలేజీలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల అనంతరం కప్పా వేరియంట్ ను వైద్యులు నిర్ధారించారు. కరోనా కొత్త వేరియంట్ ను రాష్ట్రంలో గుర్తించడంపై అధికారులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సమాచారం అందించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ (ఆరోగ్యం) అమిత్ మోహన్ ప్రసాద్ స్పందిస్తూ, కప్పా వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, చికిత్స అందుబాటులో ఉందని వివరించారు
 

Follow Us:
Download App:
  • android
  • ios