Asianet News TeluguAsianet News Telugu

కేరళలో జికా వైరస్... పెరుగుతున్న కేసులు..?

తిరువనంతపురం నుంచి 19 నమూనాలు ల్యాబ్ కి వెళ్లాయని.. వారిల వైద్యులు సహా 13మంది ఆరోగ్య కార్యకర్తలకు జికా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నామని వైరాలజీ అధికారులు తెలిపారు.

zika virus Cases spotted in Kerala
Author
Hyderabad, First Published Jul 9, 2021, 7:34 AM IST

కరోనా మహమ్మారి నుంచే ఎలా తప్పించుకోవాలో తెలీక తికమక పడుతున్న సమయంలో కొత్త రకం వైరస్ లు వచ్చీ మళ్లీ భయపెడుతున్నాయి. తాజాగా.. కేరళ రాష్ట్రంలో తొలి జికా వైరస్ కేసు వెలుగు చూసింది. 24ఏళ్ల మహిళలో ఈ వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు.


తిరువనంతపురంలో మరో 13 అనుమానిత కేసులు ఉన్నాయని.. వాటికి సంబంధించి పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థ నుంచి ధ్రువీకరణ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

తిరువనంతపురం నుంచి 19 నమూనాలు ల్యాబ్ కి వెళ్లాయని.. వారిల వైద్యులు సహా 13మంది ఆరోగ్య కార్యకర్తలకు జికా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నామని వైరాలజీ అధికారులు తెలిపారు.

ఇప్పటికే పాజిటివ్ గా నిర్థారణ అయిన మహిళ  గురువారం ఒక బిడ్డకు జన్మనిచ్చిందన్నారు. ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. జ్వరం, తలనొప్పి, చర్మం ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలతో ఆమె జూన్ 28న ఆస్పత్రిలో చేరారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆమె రాష్ట్రం దాటి ఎక్కడికీ ప్రయాణించలదేని.. ఆమె ఇల్లు తమిళనాడు సరిహద్దులో ఉందని అధికారులు  చెప్పారు. వారం కిందట ఆమె తల్లిలోనూ ఇవే లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. జికా వైరస్ లక్షణాలు కూడా డెంకీ జ్వరం లానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios