Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని పోలీసులు తెలిపారు. 

Road accident: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘ‌ట‌న ఉత్త‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. 

ఈ రోడ్డు ప్ర‌మాదం గురించి పోలీసులు వెల్ల‌డించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో సోమ‌వారం రాత్రి రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. రెండు ద్విచ‌క్ర‌వాహ‌నాలు ఢీ కొన్నాయి. శ్యామ్‌దేరా ప్రాంతంలోని మహారాజ్‌గంజ్-గోరఖ్‌పూర్ రహదారిపై రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో మ‌రొక‌రు గాయపడ్డార‌నీ, స‌ద‌రు బాధితుడి ప‌రిస్థితి ఇంకా ఆందోళ‌న‌క‌రంగానే ఉంద‌ని తెలిపారు. సోమవారం అర్థరాత్రి అజీత్‌(15), సన్ని యాదవ్‌(17), సుందరం(19)లు ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా అదుపుత‌ప్పి మ‌రో బైకును ఢీ కొట్టారు. అవ‌త‌లి బైకు పై ఆనంద్‌(26), అను(25) లు ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో అజీత్, సన్ని, ఆనంద్, అనులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయ‌ర‌ని శ్యామ్‌దేరా పోలీసు స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ఆనంద్ కుమార్ గుప్తా తెలిపారు.

ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ మ‌రో యువ‌కుడు సుందరంను ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని తెలిపారు. ఇంకా అత‌ని ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగానే ఉంద‌ని వైద్యులు తెలిపిన‌ట్టు స్థానిక‌ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. మృతుల కుటుంబాల‌కు స‌మాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

మ‌రో ప్ర‌మాదంలో ఒక‌రు మృతి..

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా మయిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలియన్ కాలా వద్ద శ్రీరామ్ ఇంటర్ కాలేజీ సమీపంలో మంగళవారం బొలెరో, బైక్ ఢీకొన్నాయి. ఇందులో బర్హాజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన గౌరా ఔట్‌పోస్ట్ ఇన్‌చార్జి రామశంకర్ యాదవ్ (46), నర్సింగ్ యాదవ్, దివాన్ సాహబ్ సింగ్ కుమారుడు దివాన్ అజయ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న బర్హాజ్, మయిల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరిని చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ఔట్‌పోస్టు ఇన్‌చార్జి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దివాన్ అజయ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఒకే కుటుంబంలో ఐదురుగు మృతి..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఆదివారం చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాల్లోకెళ్తే.. యూపీలోని బస్తీ జిల్లాలోని ముందేర్వా ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి ఆగివున్న ఉన్న కంటైనర్ ట్రక్కును కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. మృతులను సంజీవ్ కుమార్ (60), అంకిత (40), అతని కుమారుడు (17), కుమార్తె (14), మరో మహిళగా గుర్తించారు. ఖాఝౌలా పోలీస్ పోస్ట్ సమీపంలో జాతీయ రహదారి 28పై రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును వేగంగా కారు ఢీకొనడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబం లక్నో నుంచి సంత్ కబీర్ నగర్‌కు వెళుతోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.