Asianet News TeluguAsianet News Telugu

ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్: మృతుల్లో ఏపీకి చెందిన ఇద్దరు, ఎవరీ హిద్మా?

భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏపీకి చెందిన ఇద్దరు మరణిాంచారు. వారిద్దరు కూడా కోబ్రా దళానికి చెందినవారు.

Two AP Jawans killed in Cvhattishgarh encounter
Author
Raipur, First Published Apr 5, 2021, 10:58 AM IST

రాయపూర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. బీజాపూర్ లో శనివారంనాడు మావోయిస్టులు జవాన్లపై దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గల్లంతైన ఏడుగురు జవాన్ల కోసం రెండు హెలికాప్టర్లలో గాలింపు చర్యలు చేపట్టారు. 

మావోయిస్టుల దాడిలో మరణించినవారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉన్నారు. వారిద్దరు కూడా కోబ్రా దళానికి చెందినవారు. వారిలో గుంటూరు జిల్లాకు చెందిన మురళీకృష్ణ ఒకరు కాగా, విజయనగరం దిగువ వీధికి చెందిన రౌతు జగదీష్ మరొకరు.

బీజాపూర్ ఘటనకు ప్రధాన సూత్రధారి హిద్మా అని భావిస్తున్ారు. అతనిపై తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాలు50 లక్షల రూపాయల రివార్డు ప్రకటించాయి. ఎన్ కౌంటర్ లో మరణించిన మహిళా మావోయిస్టును మడవి వనజగా గుర్తించారు ఆమె నుంచి పోలీసులు ఓ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఇన్సాస్ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. 

తెర్రం ప్రాంత గుట్టలపై తాము ఉన్నట్లు మావోయిస్టులు పోలీసులను నమ్మించారు. హిద్మా కూడా అక్కడే ఉన్నాడని విశ్వసించేలా చేశారు అతన్ని పట్టుకునేందుకని వెళ్లిన బలగాలు అతని ఉచ్చులో పడ్డాయి. ఆ తర్వాత భద్రతా బలగాలను తిరుగులేని దెబ్బ తీశాడు. గతంలో కసాపాల్, మీనాఫా ఘటనలకు కూడా అతనే నాయకత్వం వహించినట్లు భావిస్తున్నారు.

హిద్మా అలియాస్ హిద్మన్న (40) సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామానికి చెందిన గిరజనుడు. 90వ దశకంలో మావోయిస్టులతో చేతులు కలిపాడు. అతను సెంట్రలో మిలిటరీ కమిషన్ కు చీఫ్ గా ఉన్నట్లు అనుమానిస్తు్నారు భీమ్ మాండవి హత్య కేసులో ఎన్ఐఎ హిద్మాపై చార్జిషీట్ దాఖలు చేసింది. హిద్మా గత 20-25 ఏళ్లుగా మావోయిస్టులతో ఉన్నాడు. అతని దళంలో 185 నుంచి 250 మంది ఉంటారని ఓ అంచనా. మావోయిస్టు సెంట్రల్ కమిటీలో చురుగ్గా వ్యవహరిస్తుంటాడని చెబుతారు.

Follow Us:
Download App:
  • android
  • ios