Asianet News TeluguAsianet News Telugu

మాకే పాఠాలు చెప్పాలని చూస్తోంది: ట్విట్టర్‌పై ఐటీ శాఖ ఆగ్రహం

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌పై కేంద్ర ఐటీశాఖ సీరియస్ వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందన్న ట్విట్టర్ వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపింది. ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలు చేసిందని ఐటీ శాఖ వ్యాఖ్యానించింది

Twitters statement an attempt to dictate its terms to India says MeitY ksp
Author
New Delhi, First Published May 27, 2021, 8:28 PM IST

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌పై కేంద్ర ఐటీశాఖ సీరియస్ వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందన్న ట్విట్టర్ వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపింది. ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలు చేసిందని ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్విట్టర్ పాఠాలు నేర్పుతోందని కేంద్రం మండిపడింది.

ట్విట్టర్ ఉద్దేశ్యపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఐటీశాఖ ఆరోపించింది. నిబంధనల గురించి పాఠాలు నేర్పేందుకు ట్విట్టర్ యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత న్యాయ వ్యవస్థను దెబ్బతీయాలని ట్విట్టర్ చూస్తోందని ఐటీ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. 

Also Read:‘మానిప్యులేటెడ్ మీడియా’’ వివాదం: ట్విట్టర్ ప్రకటనకు ఢిల్లీ పోలీసుల కౌంటర్

కాగా, ‘కాంగ్రెస్ టూల్‌కిట్’పై బీజేపీ నేతల పోస్ట్‌లకు ట్విటర్ ‘‘మానిప్యులేటెడ్ మీడియా’’ అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు సోమవారం సాయంత్రం వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే

Follow Us:
Download App:
  • android
  • ios