Asianet News TeluguAsianet News Telugu

2020లో మోస్ట్ పాపులర్ ట్వీట్స్ ఇవే..!

ఈ ఏడాది అత్యంత అగ్రస్థానంలో నిలిచిన దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖుల నుంచి ట్వీట్లు ఈ జాబితాలో ఉన్నాయి.

Twitter India in 2020: Tamil Actor Vijay's Selfie Most Retweeted, Virat kohli's Tweet Most liked
Author
Hyderabad, First Published Dec 9, 2020, 7:50 AM IST

ప్రస్తుతం ఎక్కువమంది ఫాలో అయ్యే సోషల్ మీడియా  వెబ్ సైట్ లలో ట్విట్టర్ ఒకటి.  ఈ ట్విట్టర్ ని వినియోగించేవారు కొన్ని లక్షల మంది ఉన్నారు. సెలబ్రెటీలు సైతం తాము చెప్పాలని అనుకున్న విషయాన్ని  ట్విట్టర్ లోనే షేర్ చేస్తూ ఉంటారు. కాగా..  ఈ 2020లో కొందరు సెలబ్రెటీలు చేసిన ట్వీట్స్ బాగా వైరల్ అయ్యాయి.  జనవరి 1 నుంచి నవంబరు 15 వరకు డేటాను తీసుకొని ఈ ‘గోల్డెన్ ట్వీట్స్ ఆఫ్ 2020’ జాబితా ప్రకటించింది. మరి ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ట్వీట్లు ఏవో ఓసారి చూసేద్దామా..

ఈ ఏడాది అత్యంత అగ్రస్థానంలో నిలిచిన దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖుల నుంచి ట్వీట్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు సుశాంత్ నటించిన 'దిల్ బేచర', దీపికా పదుకొణె నటించిన 'ఛపాక్' తదితర చిత్రాలు 2020 లో ట్రెండ్ ట్వీట్ లో చోటుచేసుకున్నాయి.

1. అమితాబ్ కి కరోనా..  అమితాబ్ కు కరోనా సోకిందంటూ చేసిన ట్వీట్ మోస్ట్ కోట్స్ ట్వీట్ గా మారింది.  దీనిని చాలా మంది కోట్ చేశారు. ఈ ట్వీట్ ను నెటిజన్లు దాదాపు 43వేల సార్లు కోట్ చేశారు.

2.విరుష్క ప్రెగ్నెన్సీ ప్రకటన..ఈ ఏడాది ఎక్కువ మంది లైక్ చేసిన ట్వీట్ లో విరుష్క ప్రెగ్నెన్సీ ప్రకటన కూడా ఉంది. విరుష్క ఈ తీపి కబురును ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మొత్తమ్మీద ఈ ట్వీట్‌కు 6.4 లక్షల లైకులు వచ్చాయంటే మరి ఇది ఏ రేంజ్‌లో ట్విట్టర్‌ను కుదిపేసిందో అర్థం చేసుకోవచ్చు.

3. మోస్ట్ రీట్వీట్స్ (పాలిటిక్స్) - పీఎం మోదీ

రాజకీయాల పరంగా ఎక్కువ రీట్వీట్లు పొందిన ట్వీట్.. మన ప్రధాని మోదీ చేసిందని ట్విట్టర్ వెల్లడించింది. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాలపాటు దీపాలు వెలిగించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు గుర్తుంది కదా. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుతూ ఇళ్లలోనే దీపాలు వెలిగించాలని మోదీ కోరారు. ఈ సందర్భంగా తాను దీపాలు వెలిగిస్తున్న నాలుగు ఫొటోలను ఓ సంస్కృత శ్లోకంతో సహా ట్వీట్ చేశారు. దీన్ని లక్షమందికిపైగా రీట్వీట్ చేశారని ట్విట్టర్ యాజమాన్యం వెల్లడించింది.

4.మోస్ట్ రీట్వీట్స్ బిజినెస్ లో రతన్ టాటా సాయం.. బిజినెస్ రంగంలో అత్యధికంగా రీట్వీట్లు సాధించిన ట్వీట్ ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా పేరుతో రికార్డయింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశానికి తమ కంపెనీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు. మార్జి 28న రతన్ టాటా చేసిన ఈ ట్వీట్‌ను చాలామంది రీట్వీట్ చేశారు.

5.క్రీడావిభాగంలో అత్యంత ఎక్కువగా రీట్వీట్లు నమోదు చేసింది.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ట్వీట్. ఆగస్టు 20న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ధోనీ చేసిన ట్వీట్.. ట్విట్టర్లో దుమారం రేపింది. దీన్ని వేలమంది రీట్వీట్ చేశారు. 

6.మోస్ట్ రీట్వీట్స్ - ఇలయ తలపతి విజయ్

అన్ని రంగాల్లో కలిపి రీట్వీట్లు ఎక్కువగా పొందిన ట్వీట్ సౌత్ సూపర్ స్టార్ ఇలయ తలపతి విజయ్ నుంచి వచ్చింది. ఓ సినిమా షూటింగ్ కోసం తమిళనాడులోని నేవెలికి వెళ్లిన విజయ్.. షూటింగ్ ముగించుకొని బయటకు వచ్చాడు. అక్కడ తన కోసం వచ్చిన అభిమానులంతా పడేలా బాల్కనీ నుంచి ఓ ఫొటో తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. ‘థాంక్యూ నేవెలి’ అంటూ తలపతి విజయ్ చేసిన ట్వీట్‌ను 1.5 లక్షల సార్లు రీట్వీట్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios