Twitter: ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ట్విట్టర్ వినియోగదారులు తమ అకౌంట్ ను యాక్సెస్ చేయలేకపోతున్నామని సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు.

Twitter: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ దిగ్గజం ట్విట్టర్ (Twitter) సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల చాలా మంది వినియోగదారులు వెబ్, ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు ట్వీట్లను యాక్సెస్ చేయలేకపోయారు. దీంతో ఎలాన్ మస్క్ ట్విట్టర్ పై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ట్వీట్ చేయగా రేట్ లిమిట్ ఎక్సీడెడ్ అనే ఎర్రర్ సందేశం వస్తోందని పేర్కొన్నారు. తాము రెండు గంటలుగా ఈ సమస్య నెలకొందని డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ పేర్కొంది. ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ట్విట్టర్ డౌన్ (#Twitter down) అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ అవుతుంది. ఈ అంతరాయంపై ట్విట్టర్ స్పందించాల్సి ఉంది.

ఆన్‌లైన్ సేవల అంతరాయాలను పర్యవేక్షించే వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం.. దాదాపు 4,000 మంది వినియోగదారులు Twitterతో సమస్యలను నివేదించారు. అయితే, కంపెనీ అంతరాయంపై ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో సహా అనేక పెద్ద నగరాల వినియోగదారులు ట్విట్టర్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నారని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ట్విట్టర్ ట్రెండింగ్ కూడా మొదలైంది. వేలాది మంది వినియోగదారులు ట్విట్టర్ డౌన్‌లో ఉన్నట్లు నివేదించారు.అత్యధికంగా నివేదించబడిన సమస్యలు అప్లికేషన్‌లో 42 శాతం, వెబ్‌సైట్‌లో 40 శాతం , మిగిలిన 18 శాతం ఫీడ్‌లో సమస్యలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.

ట్విట్టర్ డౌన్ కావడం ఈ ఏడాది ఇది మూడోసారి. అంతకుముందు మార్చి నెలలో కూడా, ట్విట్టర్ తన సిస్టమ్‌లో అవాంతరాలను నివేదించింది . చాలా లింక్‌లు పని చేయడం ఆగిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ప్రజలు ట్విటర్‌ను వినియోగించడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే.. గత ఏడాది కూడా జూలై నెలలో ప్రపంచంలోని మిలియన్ల మంది వినియోగదారుల ట్విట్టర్ ఖాతాలు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. ట్విటర్ సేవలు ప్రధానంగా అమెరికా, యూరప్, ఆసియాలోని అనేక ప్రాంతాల్లో ప్రభావితమైంది. భారతదేశంలో కూడా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా అనేక పెద్ద నగరాల వినియోగదారులు ట్విట్టర్ డౌన్ అయిందని ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఫిబ్రవరి 2022లో కూడా ట్విట్టర్‌కు అంతరాయం ఏర్పడింది.