Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్‌ సర్వర్‌ డౌన్‌..! ఇబ్బందులెదుర్కొన్న వినియోగదారులు 

సాంకేతిక సమస్యల కారణంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ సర్వర్‌ డౌన్‌ అయ్యింది. పలువురు వినియోగదారులు రాత్రి 7 గంటల సమయంలో పలు సమస్యలు ఎదుర్కొన్నారు. డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌లో 1,747 మంది వినియోగదారులు ట్విట్టర్‌లో సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలిపారు.

Twitter down, many users experience trouble loading pages
Author
First Published Dec 11, 2022, 10:39 PM IST

Twitter down: సాంకేతిక సమస్యల కారణంగా సోషల్ మీడియా దిగ్గజం,మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ సర్వర్‌ డౌన్‌ (Twitter down) అయ్యింది. దీంతో చాలామంది వినియోగదారులు పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేశారు. భారతదేశంలోని వేలాది మంది వినియోగదారులు ఆదివారం సాయంత్రం ట్విట్టర్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. డౌన్‌డెటెక్టర్ కూడా ట్విట్టర్ డౌన్ అయిందని ధృవీకరించింది.

డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. దాదాపు 3,000 మంది వినియోగదారులు ట్విట్టర్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. వినియోగదారులు ఈ సమస్యను ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి ఎదుర్కొన్నట్టు పేర్కొంది. డౌన్‌డిటెక్టర్‌లో 63 శాతం మంది వినియోగదారులు ట్విట్టర్ యాప్‌లో కొత్త ట్వీట్‌లు లోడ్ కావడం లేదని ఫిర్యాదు చేశారు. కాగా వెబ్‌సైట్ పనిచేయడం లేదని 36 శాతం మంది ఫిర్యాదు చేశారు. ఇది కాకుండా, యాప్ మరియు వెబ్‌సైట్ రెండింటిలోనూ ట్వీట్‌లను అప్‌లోడ్ చేయడంలో 1 శాతం మంది వినియోగదారులు ఇబ్బంది పడినట్టు పేర్కొంది. 
 
1.5 బిలియన్ల ట్విట్టర్ ఖాతాలు తొలగింపు

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ 1.5 బిలియన్ల ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని నిర్ణయించుకున్నాడు. ఎలోన్ మస్క్ ట్వీట్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. కొన్నేళ్లుగా యాక్టివ్‌గా లేని  1.5 బిలియన్ ఖాతాలు త్వరలో తొలగించబడతాయని ఆయన పేర్కొన్నారు. ఆ ఖాతాలను తొలగించడం ద్వారా స్పేస్ సృష్టించబడుతుందని అన్నారు. ట్విట్టర్ త్వరలో తన ప్లాట్‌ఫారమ్ నుండి 1.5 బిలియన్ ఖాతాల పేర్లను తొలగించడం ప్రారంభించనుంది. ఈ జాబితాలో చాలా కాలంగా ఏదీ ట్వీట్ చేయని లేదా పోస్ట్ చేయని ఖాతాలు ఉండవచ్చుననీ, చాలా కాలంగా లాగిన్ చేయని ఖాతాలు ఉంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఖాతాలను ఇన్‌యాక్టివ్‌గా పరిగణించి, ట్విట్టర్ వాటిని తొలగించబోతోందని సమాచారం. 

బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ పునః ప్రారంభం

ట్విట్టర్ తన బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ను సోమవారం నుండి పునఃప్రారంభించబోతోంది. ఈ విషయాన్ని ట్విటర్ ఆదివారం వెల్లడించింది. డిసెంబర్ 12 నుంచి బ్లూ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ (ట్విట్టర్ బ్లూ టిక్)ను పునఃప్రారంభిస్తామని ట్విట్టర్ తెలిపింది. దీని ధర ఆండ్రాయిడ్ వినియోగదారులకు నెలకు $8 యూఎస్ డాల్లరు,  ఐఫోన్ వినియోగదారులకు నెలకు $11 యూఎస్ డాల్లరు వసూల్ చేయనున్నది. మస్క్ ఐఫోన్ వినియోగదారుల కోసం ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ధరను $8 నుండి $11కి పెంచింది.

అంతకుముందు రోజు Gmail సర్వీసుల అంతరాయం 

అంతకుముందు శనివారం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారుల కోసం గూగుల్ ఇమెయిల్ సర్వీస్ Gmail నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాల వల్ల Gmail యాప్ , డెస్క్‌టాప్ వెర్షన్‌లు రెండూ ప్రభావితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులకు Gmail సేవలు నిలిచిపోయాయి. Google ఈ సమస్యను వెంటనే పరిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్లకు పైగా జిమెయిల్ యూజర్లను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. 2022 సంవత్సరంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌లలో Gmail కూడా ఒకటి.

Follow Us:
Download App:
  • android
  • ios