Asianet News TeluguAsianet News Telugu

సెంటర్ వర్సెస్ ట్విట్టర్.. పోస్టులు తొలగించాలన్న కేంద్రం ఆదేశాలపై న్యాయస్థానంలో సవాల్

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పలు ఆదేశాలను సవాల్ చేస్తూ ట్విట్టర్ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. పలు ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో అందుకు ఉపక్రమించడానికి సరితూగే కారణాలను కేంద్రం పేర్కొనలేదని వివరించింది. ఐటీ యాక్ట్ సెక్షన్ 69 కింద బ్లాక్ చేయడానికి కావాల్సిన కారణాలు కేంద్రం చూపెట్టలేదని, కాబట్టి, అలాంటి ఆదేశాలను, బ్లాక్ చేయాలన్న కంటెంట్‌లనూ సమీక్షించాలని రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

twitter challenges centre blocking orders in karnataka high court.. seeks judicial review
Author
New Delhi, First Published Jul 5, 2022, 6:12 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య కోల్డ్ వార్ కొన్ని నెలలుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను పాటించడం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. అంతేకాదు, ట్విట్టర్‌కు కూడా వార్నింగ్‌లు ఇచ్చింది. కొన్ని కారణాలు చూపెడుతూ.. ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లో పోస్టు చేసిన కొంత కంటెంట్‌ను తొలగించాలని కేంద్రం పలు ఆదేశాలు ట్విట్టర్‌కు పంపింది. కానీ, అందులో కొన్ని ఐటీ యాక్ట్ సెక్షన్ 69ఏ చెబుతున్నట్టు అర్హతలను కలిగి లేవని ట్విట్టర్ చెబుతున్నది. న్యాయస్థానం జ్యుడీషియల్ రివ్యూ చేపట్టాలని కోరుతూ ట్విట్టర్ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈ హైకోర్టులో ట్విట్టర్ ఓ రిట్ పిటిషన్ వేసింది.

కేంద్ర ప్రభుత్వం తమ ప్లాట్‌ఫామ్‌లో పోస్టు అయిన పలు కంటెంట్‌ను తొలగించాలని, పలు యూజర్లనూ తొలగించాలని పలు ఆదేశాలు జారీ చేసిందని ట్విట్టర్ రిట్ పిటషన్‌లో పేర్కొన్నట్టు పిటిషన్ చూసిన కొన్ని వర్గాలు వివరించాయి. ఐటీ యాక్ట్ సెక్షన్ 69ఏను ఉటంకిస్తూ బ్లాక్ చేయాలని చాలా ఆదేశాలను పంపిందని ట్విట్టర్ పేర్కొంది. కానీ, అందులో కొన్ని కేంద్రం చెబుతున్నట్టు 69ఏ కింద తొలగించడానికి అర్హమైనవేమీ కాదని వివరించింది.

కంటెంట్ తొలగించాలని తాము జారీ చేసిన కొన్ని ఆదేశాలకు అనుగుణంగా ట్విట్టర్ నడుచుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఐటీ శాఖ గత జూన్‌లోనే ట్విట్టర్‌ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఇటు వినియోగదారుల హక్కులను కాపాడుకోవడానికి ట్విట్టర్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, తొలగించాలని కోరుతున్న కంటెంట్‌ను కోర్టు పరిశీలించాలని, ఇందుకోసం ప్రత్యేక జ్యూడీషియల్ రివ్యూ  చేపట్టాలని కోరింది.

అకౌంట్ లెవెల్ బ్లాకింగ్ అంటే.. రాజ్యాంగం యూజర్లకు కల్పించిన హక్కులను కాలరాయడమేనని, ముఖ్యంగా యూఆర్ఎల్ ‌లను బ్లాక్ చేయాలని కేంద్రం కేవలం సెక్షన్ 69ఏను ప్రస్తావిస్తూ కోరడాన్ని సమర్థించలేమని ట్విట్టర్ భావించింది. ఆ కంటెంట్ తొలగించడానికి, లేదా యూజర్‌లను బ్లాక్ చేయడానికి 69ఏలో ప్రస్తావించిన నిబంధనలకు సరితూగే కారణాలను కేంద్రం చూపెట్టడం లేదని వివరించింది. కాబట్టి వీటిని సమీక్షించాలని ట్విట్టర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.

జున్ నెలలో ట్విట్టర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానికక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఘాటైన లేఖ పంపింది. తమ ఆదేశాలకు లోబడి నడుచుకోకుంటే ట్విట్టర్ చీఫ్ కంప్లయెన్స్ ఆఫీసర్‌పై క్రిమినల్ చర్యలు మొదలు పెట్టడమే కాదు.. ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 79(1) కింద ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌కు లభించే రక్షణ కూడా తొలగిస్తామని హెచ్చరించింది. దీంతో ట్విట్టర్.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అనేక బ్లాకింగ్ ఆర్డర్‌లను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించింది.

Follow Us:
Download App:
  • android
  • ios