Asianet News TeluguAsianet News Telugu

ఒకే వ్యక్తిని పెళ్లాడిన ట్విన్ సిస్టర్లు.. కారణం ఇదేనంటా!.. వైరల్ వీడియో ఇదే

మహారాష్ట్రలో ఇద్దరు కవల సోదరీమణులు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి వారి మధ్య సంపూర్ణ అంగీకారం ఉన్నది. ఇరు కుటుంబాలూ వీరి పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

twin sisters marries same person in maharashtra video viral
Author
First Published Dec 4, 2022, 8:19 PM IST

ముంబయి: మహారాష్ట్రలో ఓ విచిత్రమైన వివాహం జరిగింది. ఇద్దరు కవల సోదరీమణులు ఒకే వ్యక్తిని.. ఒకే పెళ్లి మండపంలో కలిసి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివాహం మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా మలషిరాస్ తాలూకాలో జరిగింది. ఆ ఇద్దరు సిస్టర్లు ఐటీ ఇంజినీర్లు. వీరి పెళ్లికి ఉభయ కుటుంబాల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం లేకపోవడం గమనార్హం.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఈ పెళ్లి చెల్లుబాటు అవుతుందా? అనే ప్రశ్నలు వచ్చాయి. అంతేకాదు, హిందూ మ్యారేజీ యాక్ట్ కింద ఈ వివాహానికి అనుమతి ఉంటుందా? అనే ప్రశ్నలు కూడా నెటిజన్లు వేస్తున్నారు.

ఇద్దరు ట్విన్ సిస్టర్స్ రింకి, పింకిలు ఐటీ ఇంజినీర్లు. వీరిద్దరూ అతుల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పెళ్లి చేసుకున్నారు. అతుల్‌క ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ ఉన్నది. ఈ ముగ్గురూ చిన్నప్పటి నుంచీ కలిసే పెరిగారు. ఒకే ఇంటిలో పెరిగారు.

Also Read: ఆన్సర్ పేపర్ రివాల్యుయేషన్ చేసుకుంది.. స్టేట్ టాపర్‌గా నిలిచింది..!

రింకి, పింకిల తండ్రి చనిపోయిన తర్వాత తల్లితోనే జీవిస్తున్నారు. కానీ, తల్లి అనారోగ్యం బారిన పడేది. ఆమెను హాస్పిటల్ తీసుకువెళ్లడానికి అతుల్ కార్‌నే వినియోగించుకునేవారు.

ఈ వెడ్డింగ్ గురించి చర్చ మొదలయ్యాక స్థానిక పోలీసులు కూడా ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించారు. ఉభయ కుటుంబాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదా? బలవంతపు నిర్ణయం వంటి ఆరోపణలు కూడా రాలేవు.

అయితే, తమకు అందిన ఫిర్యాదు మేరకు అతుల్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఐపీసీలోని 494 సెక్షన్ కింద అతడిపై కేసు రిజిస్టర్ అయిందని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios