Asianet News TeluguAsianet News Telugu

వ్యాపారిని హత్యకేసులో ఇరికించి, బెదిరింపు... టీవీఛానల్ యజమాని అరెస్ట్..!

అమిత్ వైద్య అనే ఛానల్ యజమానికి ఆదివారం అర్థరాత్రి అతని ఫామ్ హౌస్ నుంచి బులాంద్‌షహర్ పోలీసుల బృందం అదుపులోకి తీసుకుంది. తప్పుడు కేసు నమోదుచేసిన నిందితులైన ఆరుగురిలో ఒకడైన సదరు ఛానల్ ఎండీ పరారీలో ఉన్నాడు.

TV channel owner frames businessman in murder bid, held in Uttar Pradesh - bsb
Author
Hyderabad, First Published Jul 14, 2021, 9:35 AM IST

మీరట్ : ఒక వ్యాపారవేత్త హత్య కేసులో టీవీ ఛానల్ యజమానికి అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివార్లలోని చత్తర్‌పూర్‌లోని ఫామ్‌హౌస్ లో అతన్ని అరెస్ట్ చేసినట్టు యుపి పోలీసులు సోమవారం తెలిపారు. వ్యాపారవేత్త హత్యకు స్కెచ్ వేశాడనే నేరం కింద అతన్నిఅదుపులోకి తీసుకున్నారు. 

అమిత్ వైద్య అనే ఛానల్ యజమానికి ఆదివారం అర్థరాత్రి అతని ఫామ్ హౌస్ నుంచి బులాంద్‌షహర్ పోలీసుల బృందం అదుపులోకి తీసుకుంది. తప్పుడు కేసు నమోదుచేసిన నిందితులైన ఆరుగురిలో ఒకడైన సదరు ఛానల్ ఎండీ పరారీలో ఉన్నాడు.

ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సుమిత్ వాలియాపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన బులాండ్‌షహర్‌ కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు. "ఆరుగురు నిందితులతో కలిసి కుట్ర పన్నినందుకు" అతని మీద నేరం నమోదయ్యింది. 

యుపి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాలియాతో లావాదేవీల్లో తేడా రావడంతో వైద్య అతన్ని తప్పుడు కేసులో ఇరికించాడు. చత్తర్‌పూర్ ప్రాంతంలోని వాలియా బంగ్లా ప్రక్కనే ఉన్న ఖరీదైన స్థలాన్ని కొట్టేయడానికి వైద్య ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ స్థలంలో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ కట్టాలని అతని ఆలోచన.

అయితే ఇది నిబంధనలకు విరుద్ధం. దీంతో ఈ విషయాన్ని వాలియా అధికారులకు ఫిర్యాదు చేయడంతో అతని మీద వైద్య కక్ష పెంచుకున్నాడు. దాంతో అతన్ని కేసులో ఇరికించాలని స్కెచ్ వేశారు. దీంట్లో భాగంగానే బులంద్‌షహర్ పోలీస్‌స్టేషన్‌లో  హత్యాయత్నం కేసును  నమోదు చేశారు. అక్కడి  SI, కూడా వీరితో కలిశాడు. 

ఇది తప్పుడు కేసు.. వైద్య, వాలియా మద్యున్న లావాదేవీలు తీర్చడానికి, వాలియాను భయపెట్టడానికి ఉద్దేశించబడింది" అని ఒక పోలీసు అధికారి చెప్పారు. బులంద్‌షహర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) సంతోష్ కుమార్ సింగ్ అసలు కేసు ఎలా నమోదైందనే దాని గురించి వివరాలు తెలిపారు. 

దీనికోసం పక్కా ప్రణాళికతో స్కెచ్ వేశారు. వేరే టీవీ ఛానెల్‌తో రిపోర్టర్‌ను వైద్య దీనికోసం ఉపయోగించాడు. ఆ రిపోర్టర్, మరికొంతమంది అతని స్నేహితులు కలిసి వాలియాను వలలో వేసుకున్నారు. వారు బులంద్‌షహర్‌లోని అనుప్‌షహర్ నివాసి గౌరవ్ శర్మ అనే డ్రగ్స్ అడిక్ట్ వ్యక్తిని దీనికోసం వాడుకున్నారు. గౌరవ్ శర్మ గతంలో కూడా వాలియా కోసం పనిచేశాడు. 

ఆ తరువాత పథకం ప్రకారం గౌరవ్ కు స్థానికంగా దొరికే అనస్థీషియా ఇచ్చారు. అది నిజమైన దాడిలా అనిపించేలా.. ‘పొడిచి చంపారు’. దీనికోసం గౌరవ్ కు ఆయనకు రూ .50 వేలు చెల్లించారు. ఆ తరువాత గౌరవ్ స్థానిక పోలీస్ లకు కాల్ చేశారు. వారు అక్కడికిచేరుకుని ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అతని ఫిర్యాదు మేరకు, జూన్ 10 న ఎఫ్ఐఆర్ దాఖలైంది. దీంట్లో వాలియాపై హత్యాయత్నం కేసు నమోదైంది. ” అని చెప్పారు. 

అయితే వాలియా మాట్లాడుతూ.. “పోలీసులు,  కొంతమంది అనుమానాస్పద వ్యక్తుల బృందం నా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించింది, ఇంట్లోని వస్తువుల్ని చిందరవందర చేశాడు, నా కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు. దీంతో నేను సీనియర్ పోలీసు అధికారులను కలిసి, మా ఇంటి పక్కనే ఉన్న ప్లేస్ విషయంలో నేను అడ్డుపడ్డందుకు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి వారికి చెప్పా.. దీంతో వారు దర్యాప్తు ప్రారంభించారు అన్నారు. 

గౌరవ్‌పై దాడి జరిగిన బాలింద్‌షహర్‌కు వాలియా ఎప్పుడూ వెళ్లలేదని దర్యాప్తులో తేలింది. గౌరవ్ కాల్ డేటా పరిశీలించగా.. దాడికి ముందు నుంచి అతను వైద్య, మరో 6 నిందితులతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు తేలింది”అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

మీరట్ జోన్ ADG రాజీవ్ సభర్వాల్ ప్రకారం, "ఈ కేసు దర్యాప్తు అధికారి రామ్ సేన్ ను సస్పెండ్ చేసి పోలీసు లైన్ కు పంపాం" అని తెలిపారు. అంతేకాదు వైద్య, గౌరవ్‌లను అరెస్టు చేశారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం అని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios