ముంబై: టీవీ నటి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలోని మీరా రోడ్డులో జరిగింది. ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. సెటల్ శర్మ దిల్ తో హ్యాపీ హై జీ అనే టీవీ సీరియల్ లో నటించారు. 

సెజల్ శర్మ గదిలో సూసైడ్ నోట్ లభించింది. ఆమె సూసైడ్ చేసుకున్న సమయంలో ఇంట్లో ఇద్దరు మిత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టీవీ ఆత్మహత్యకు కారణం తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తిగత జీవితంలోని ఇబ్బందుల వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుకని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఉదయ్ పూర్ కు చెందిన సెజల్ శర్మ 2017లో ముంబై వచ్చి యాక్టింగ్ లో కెరీర్ ను ప్రారంభించారు. 

ఆజాద్ పరిందే అనే వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటించారు. దిల్ తో హ్యాపీ హై జీలో నటించడానికి ముందు కొన్ని కమర్షియల్స్ లో కూడా కనిపించింది. ఆమె మృతదేహాన్ని స్వస్థలం ఉదయ్ పూర్ కు తరలించారు.