బెంగళూరు: యాంకర్, నటి చందన ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఆమె ప్రియుడు దినేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. ప్రియుడు మోసం చేసి వదిలేశాడని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

తనను ప్రేమించిన దినేష్ తనను నమ్మించి మోసం చేశాడని, శారీరకంగా కూడా వాడుకుని అన్యాయం చేశాడని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి చందన ఆత్మహత్య చేసుకుంది. చందన తల్లిదండ్రులు దినేష్ మీద ఆరెస్టు చేశారు. 

చందన ఆత్మహత్య తర్వాత పారిపోయిన దినేష్ ను పోలీసులు ఆదివారంనాడు ఆరెస్టు చేశారు. చంనద బెంగళూరులోని తన నివాసంలో విషం తీసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మే 28వ తేదీన జరిగినప్పటికీ జూన్ 1వ తేదీిన వెలుగులోకి వచ్చింది. 

చందన తన మొబైల్ లో సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. అంతే కాకుండా డెత్ నోట్ కూడా రాసింది. కర్ణాటకలోని హసన్ జిల్లా బెలూరుకు చెందిన చందన దినేష్ అనే వ్యక్తితో సంబంధాలు కొనసాగిస్తూ వ చ్చింంది. గత కొన్నేళ్లుగా వారి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. పెళ్లి చేసుకోవడానికి దినేష్ నిరాకరించడంతో చందన ఆత్మహత్య చేసుకుంది.