గాడ్సేకి పిస్టల్ అందించింది సావర్కరే.. గాంధీ మనుమడి సంచలన ఆరోపణ

సావర్కర్‌పై మహాత్మాగాంధీ మనుమడు తుషార్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.మహాత్మా గాంధీ హత్యకు రెండు రోజుల ముందు వరకు నాథూరామ్ గాడ్సే వద్ద పిస్టల్ లేదని, నాథూరామ్ గాడ్సేకు పిస్టల్ అందించింది సావర్కర్ అని తుషార్ పేర్కొన్నాడు. 

Tushar Gandhi has alleged that Savarkar had provided a gun to Nathuram Godse to kill Mahatma Gandhi

భారత్ జోడో యాత్రలో సావర్కర్‌పై కాంగ్రెస్ మాజీ అధినేత, సీనియర్ నేత రాహుల్ గాంధీ వివాదాస్పద ప్రకటన చేశారు. దీని తర్వాత మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరోవైపు..ఈ వివాదంపై బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది.  రాహుల్ గాంధీ ప్రకటనతో తాము ఏకీభవించడం లేదని, ఇది పార్టీలో చీలికకు దారితీస్తుందని శివసేన పేర్కోంది. ఈ తరుణంలో మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా సావర్కర్‌పై మరో సంచలన ప్రకటన చేశారు. దీంతో దేశవ్యాప్తంగా దూమారం చేలారేగుతోంది. 

మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సావర్కర్‌పై ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో కొత్త వివాదం తలెత్తే అవకాశం ఉంది. మహాత్మాగాంధీని చంపేందుకు నాథూరాం గాడ్సేకు తుపాకీని సావర్కర్ సమకూర్చాడని ఆరోపించారు తుషార్ గాంధీ. ఆయన ఓ ట్వీట్‌లో ..“సావర్కర్ బ్రిటీష్ వారికి సహాయం చేయడమే కాకుండా బాపును చంపడానికి నాథూరామ్ గాడ్సేకి తుపాకీని కూడా అందించాడు. బాపు హత్యకు రెండు రోజుల ముందు గాడ్సే వద్ద ఆయుధం లేదు.'' అని తుషార్ గాంధీ పేర్కొన్నారు. 

ఇది ఆరోపణ కాదు, చరిత్రలో రికార్డయింది..

తాను ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని, చరిత్రలో నమోదైన విషయాలనే చెబుతున్నానన్నారు. తుషార్ గాంధీ మాట్లాడుతూ.. “నేను ఆరోపణలు చేయడం లేదు. చరిత్రలో ఏం రాసిందో చెప్పాను. పోలీసు ఎఫ్ఐఆర్ ప్రకారం.. నాథూరామ్ గాడ్సే , వినాయక్ ఆప్టేలు సావర్కర్‌ను 1948 జనవరి 26-27 మధ్య కలిశారు. నాథూరామ్ గాడ్సే వద్ద ఆ రోజు వరకు తుపాకీ లేదు. తుపాకీ కోసం ముంబై అంతా తిరుగుతున్నాడు. అయితే ఈ పర్యటన అనంతరం నేరుగా ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి గ్వాలియర్‌కు వెళ్లారు. గ్వాలియర్‌లో సావర్కరిస్టు అయిన పర్చూరేను కలిశాడు. దీని తర్వాత అతనికి అత్యుత్తమ పిస్టల్ లభించింది. ఇదంతా బాపు హత్యకు రెండు రోజుల ముందు జరిగింది. అదే నేను చెప్పాను, కొత్తగా ఏమీ ఆరోపణలు చేయలేదు. అని తుషార్ గాంధీ వివరణ ఇచ్చారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ సావర్కర్ పిరికివాడని, బ్రిటిష్ పాలకులను క్షమాపణ కోరుతూ సంతకం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios