నెటింట్లో ఓ వీడియో తెగ వైరలవుతుంది. వైరల్ వీడియోలో ఓ తులసి మొక్క తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక ఎత్తైన చెట్టు అడుగున నాటిన తులసి మొక్క అటు ఇటు తిరుగుతున్నట్లుంది. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో వీడియోలకు కొదవలేదు. ప్రతిరోజూ ఎన్నో కొత్త కొత్త వీడియోలను చూడవచ్చు. కొన్ని వీడియోలు సరదా పంచుతే.. మరికొన్ని వీడియోలు సందేశాన్ని అందిస్తుంటాయి. కానీ, కొన్ని వీడియో మాత్రం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి వీడియోలను మీరు కూడా చూసే ఉంటారు. అయితే.. ఆ వీడియోలు నిజమైనవేనా.. కావో.. తేల్చుకోవడం కష్టమే. ఇప్పుడూ అలాంటి ఒక వీడియో ఒకటి చర్చలో ఉంది. అందులో ఒక తులసి మొక్క తనంతట తానుగా తిరుగుతుంది. అది చూసిన మహిళలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది (తులసి డ్యాన్స్ వీడియో).
ఇటీవల @saffron_bearer_no_1 అనే Instagram ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేయబడింది. ఆ వీడియోలో ఓ తులసి మొక్క అటు ఇటు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఒక ఎత్తైన చెట్టు అడుగున నాటిన తులసి మొక్క అటు ఇటు తిరుగుతున్నట్టు చూడవచ్చు. అది చూసిన అక్కడి జనం ఆశ్చర్యపోవటం, కేరింతలు కొట్టడం వీడియోలో వినిపించింది. తులసి మొక్క కదులుతోంది.. దానంతటదే డ్యాన్స్ చేస్తోంది.. అంటూ చర్చించుకుంటున్నారు.
వైరల్ అవుతోన్న ఆ వీడియోకు 37 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది దేవుడి మహిమ, ఇదో అద్భుతం అని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది మూఢనమ్మకాలతో ముడిపెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది దీనిని దేవుడి అద్భుతం అంటూ కామెంట్స్ చేయడం చూడవచ్చు. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉంటే.. సనాతన ధర్మంలో తులసికి దేవత హోదా ఇవ్వబడింది. ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది ప్రతిరోజు తులసి మొక్కను పూజించిన తర్వాతే మిగతా పనులు ప్రారంభిస్తారు. ఈ మొక్కను పూజలలో ఉపయోగిస్తారు. ఇందులో అనేక వైద్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జలుబు, ఫ్లూ నుండి దూరంగా ఉండటానికి తరచుగా ప్రజలు తులసి ఆకులను తింటారు.
