నేటివార్తల్లోని ముఖ్యాంశాలివే

Tuesday 27th September Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:21 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఫస్ట్ వికెట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపు తిరిగింది. ఓన్లీ మచ్ లౌడర్‌ కంపెనీ సీఈవోని సీబీఐ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఓన్లీ మచ్ లౌడర్‌ కంపెనీకి సీఈవోగా విజయ్ నాయర్ కొనసాగుతున్నారు. ఈ సంస్థ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తూ వుంటుంది. 

8:32 PM IST

విశాఖ నుంచి ఇన్ఫోసిస్ సేవలు

అక్టోబర్ 1 నుంచి విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ కార్యకలాపాలు మొదలుపెట్టనుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. తొలి దశలో 1000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. క్రమంగా ఇక్కడ సిబ్బంది సంఖ్య పెరుగుతుందని అమర్‌నాథ్ పేర్కొన్నారు. 

7:22 PM IST

టూరిజంలో తెలంగాణకు నాలుగు అవార్డులు

పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. నాలుగు రంగాల్లో అవార్డలు సాధించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ నుంచి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవార్డులను అందుకున్నారు. 

6:07 PM IST

పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం

పుదుచ్చేరిలోని ఎన్నార్ కాంగ్రెస్- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చిచ్చు రేగింది. హోంమంత్రి నమశ్శివాయమ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎం పదవులు టార్గెట్‌గా బీజేపీ ఆపరేషన్ లోటస్‌ స్కెచ్ గీసింది. మరోవైపు ఎన్నార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అంతేకాకుండా రాజీనామాలకు కూడా సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. 

5:30 PM IST

ఉద్ధవ్‌ థాక్రేకు సుప్రీంకోర్ట్ షాక్

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు షాక్ తగిలింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఈసీకి ఉందని ధర్మాసనం తేల్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పిటిషన్‌పై ఈ మేరకు సుప్రీం తీర్పు చెప్పింది. 

4:41 PM IST

మహారాష్ట్రలో 25మంది పిఎఫ్ఐ కార్యకర్తల అరెస్ట్

మహారాష్ట్రలో 25మంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నవిస్ ప్రకటించారు. వీరికి ఉగ్రవాద కార్యకలాపాలతో సబంధాలు, లభించిన ఆధారాల ఆధారంగా చట్టపరంగానే శిక్షిస్తామని తెలిపారు. ఔరంగాబాద్ లో 14, థానే లో 4, నాందేడ్ లో 2, పర్బనిలో 2, మాలేగావ్ లో 2, అమరావతిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
3:32 PM IST

బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ కు దాదా సాహెబ్ పాల్కే  అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. 2020 సంవత్సరానికి గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 30న జరిగే జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. 

2:33 PM IST

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పెరుగుతున్న పోటీ... కొత్తగా తెరపైకి ఖర్గే, దిగ్విజయ్, భన్సల్

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ కేంద్ర మంత్ర శశి థరూర్ పోటీలో నిలిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా దిగ్విజయ్ సింగ్. మల్లికార్జున ఖర్గే, పవన్ కుమార్ భన్సల్ కూడా పోటీలో నిలుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. శశిథరూర్ ఈ నెల 30న నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఇక భన్సల్ కూడా నామినేషన్ కు సంబంధించిన పత్రాలను తీసుకున్నట్లు సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ  తెలిపారు. 

1:15 PM IST

అన్నాడీఎంకేలో మళ్ళీ ముసలం... పార్టీ సెక్రటరీపై పళనిస్వామి వేటు

తమిళనాడులో ప్రతిపక్ష అన్నా డిఎంకే లో వర్గపోరు ఇటీవల తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పార్టీలో అంతర్గత విబేధాలు రచ్చకెక్కాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ ప్రత్యర్థి వర్గానికి చెందిన ఎస్ రామచంద్రన్ పై తాత్కాలిక జనరల్ సెక్రటరీ పళనిస్వామి నిషేదం విధించారు. పార్టీ కార్యదర్శి పదవితో పాటు రామచంద్రన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తొలగిస్తున్నట్లు పళనిస్వామి ప్రకటించారు. 

12:01 PM IST

పిఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలు... ఎంపీలో 20, గుజరాత్ లో10మంది అరెస్ట్

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) సంస్థపై దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ పోలీసులు 20 మంది పిఎఫ్ఐ సంస్థలో సంబంధాలున్నవారిని అరెస్ట్ చేసారు. అలాగే గుజరాత్ లో మరో 10 మందిని యాంటి టెర్రరిస్ట్ స్వాడ్, ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది 

11:03 AM IST

భారత్ లో 42,358కి తగ్గిన యాక్టివ్ కరోనా కేసులు

భారత్ లో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ఒకప్పుడు లక్షల కేసులు నమోదవగా ఇప్పుడు కేవలం ఐదువేలు కూడా దాటడంలేదు. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 3,230 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా వుండటంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 42,358 కు చేరింది. 

9:59 AM IST

రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం

గడప గడపకు ప్రభుత్వం  కార్యక్రమంపై బుధవారం సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం తాడేపల్లిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో సీఎం సమావేశం కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఐ పాక్ టీం నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో దీనిపైనే ఈ మీటింగ్ లో చర్చించే అవకాశాలున్నాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఐపాక్ నివేదికలు వున్నట్లు సమాచారం. దీనిపై సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

9:22 AM IST

మా ఇష్టం వచ్చినోళ్లకే దళితబంధు..:  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

దళిత బంధు గురించి ప్రశ్నించిన వారిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చిందులు తొక్కారు. తమకు ఇష్టం వచ్చినోళ్లకే దళిత బంధు ఇస్తామన్నారు. తనను ప్రశ్నించిన వారిని సభ నుండి బయటకు తీసుకెళ్లాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. 

9:16 AM IST

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు భారీ వర్షాలు...

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. మరో మూడు రోజుల పాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. ఇక అక్కడక్కడ చెదురుమదురు జల్లులు, ఓ మోస్తరు వర్షాలు కురిస్తాయని వెల్లడించారు.  
 
9:21 PM IST:

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపు తిరిగింది. ఓన్లీ మచ్ లౌడర్‌ కంపెనీ సీఈవోని సీబీఐ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఓన్లీ మచ్ లౌడర్‌ కంపెనీకి సీఈవోగా విజయ్ నాయర్ కొనసాగుతున్నారు. ఈ సంస్థ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తూ వుంటుంది. 

8:32 PM IST:

అక్టోబర్ 1 నుంచి విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ కార్యకలాపాలు మొదలుపెట్టనుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. తొలి దశలో 1000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. క్రమంగా ఇక్కడ సిబ్బంది సంఖ్య పెరుగుతుందని అమర్‌నాథ్ పేర్కొన్నారు. 

7:22 PM IST:

పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. నాలుగు రంగాల్లో అవార్డలు సాధించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ నుంచి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవార్డులను అందుకున్నారు. 

6:07 PM IST:

పుదుచ్చేరిలోని ఎన్నార్ కాంగ్రెస్- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చిచ్చు రేగింది. హోంమంత్రి నమశ్శివాయమ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎం పదవులు టార్గెట్‌గా బీజేపీ ఆపరేషన్ లోటస్‌ స్కెచ్ గీసింది. మరోవైపు ఎన్నార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అంతేకాకుండా రాజీనామాలకు కూడా సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. 

5:30 PM IST:

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు షాక్ తగిలింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఈసీకి ఉందని ధర్మాసనం తేల్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పిటిషన్‌పై ఈ మేరకు సుప్రీం తీర్పు చెప్పింది. 

4:41 PM IST:

మహారాష్ట్రలో 25మంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నవిస్ ప్రకటించారు. వీరికి ఉగ్రవాద కార్యకలాపాలతో సబంధాలు, లభించిన ఆధారాల ఆధారంగా చట్టపరంగానే శిక్షిస్తామని తెలిపారు. ఔరంగాబాద్ లో 14, థానే లో 4, నాందేడ్ లో 2, పర్బనిలో 2, మాలేగావ్ లో 2, అమరావతిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
3:32 PM IST:

ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. 2020 సంవత్సరానికి గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 30న జరిగే జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. 

2:33 PM IST:

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ కేంద్ర మంత్ర శశి థరూర్ పోటీలో నిలిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా దిగ్విజయ్ సింగ్. మల్లికార్జున ఖర్గే, పవన్ కుమార్ భన్సల్ కూడా పోటీలో నిలుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. శశిథరూర్ ఈ నెల 30న నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఇక భన్సల్ కూడా నామినేషన్ కు సంబంధించిన పత్రాలను తీసుకున్నట్లు సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ  తెలిపారు. 

1:15 PM IST:

తమిళనాడులో ప్రతిపక్ష అన్నా డిఎంకే లో వర్గపోరు ఇటీవల తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పార్టీలో అంతర్గత విబేధాలు రచ్చకెక్కాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ ప్రత్యర్థి వర్గానికి చెందిన ఎస్ రామచంద్రన్ పై తాత్కాలిక జనరల్ సెక్రటరీ పళనిస్వామి నిషేదం విధించారు. పార్టీ కార్యదర్శి పదవితో పాటు రామచంద్రన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తొలగిస్తున్నట్లు పళనిస్వామి ప్రకటించారు. 

12:01 PM IST:

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) సంస్థపై దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ పోలీసులు 20 మంది పిఎఫ్ఐ సంస్థలో సంబంధాలున్నవారిని అరెస్ట్ చేసారు. అలాగే గుజరాత్ లో మరో 10 మందిని యాంటి టెర్రరిస్ట్ స్వాడ్, ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది 

11:03 AM IST:

భారత్ లో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ఒకప్పుడు లక్షల కేసులు నమోదవగా ఇప్పుడు కేవలం ఐదువేలు కూడా దాటడంలేదు. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 3,230 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా వుండటంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 42,358 కు చేరింది. 

9:59 AM IST:

గడప గడపకు ప్రభుత్వం  కార్యక్రమంపై బుధవారం సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం తాడేపల్లిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో సీఎం సమావేశం కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఐ పాక్ టీం నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో దీనిపైనే ఈ మీటింగ్ లో చర్చించే అవకాశాలున్నాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఐపాక్ నివేదికలు వున్నట్లు సమాచారం. దీనిపై సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

9:22 AM IST:

దళిత బంధు గురించి ప్రశ్నించిన వారిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చిందులు తొక్కారు. తమకు ఇష్టం వచ్చినోళ్లకే దళిత బంధు ఇస్తామన్నారు. తనను ప్రశ్నించిన వారిని సభ నుండి బయటకు తీసుకెళ్లాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. 

9:16 AM IST: