నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Tuesday 25th October Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

10:13 PM IST

జగన్ సీమ (చీమ) టపాకాయ్ : బుచ్చయ్య చౌదరి

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్‌ను సీమ టపాకాయ్ అనుకుంటే, ఆయన చీమ టపాకాయ్ అయ్యారని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఇక మంత్రులు , వైసీపీ నేతలు తారాజువ్వల్లాగా పైకి వెళ్లి కిందపడటం అలవాటుగా మారిపోయారని గోరంట్ల సెటైర్లు వేశారు. 
 
9:06 PM IST

అక్టోబర్ 31న మునుగోడులో బీజేపీ సభ

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని ఊరకలెత్తించనుంది. దీనిలో భాగంగా ఆ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 

8:15 PM IST

వనపర్తిలో పరువు హత్య

వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించిందని కూతురిని కన్నతండ్రే దారుణంగా హతమార్చాడు. పెబ్బేరు మండలం పాతపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడ్డాడు.

7:21 PM IST

విడిచిన సూర్యగ్రహణం

తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం విడిచింది. ఆకాశంలో చోటు చేసుకున్న అద్భుతాన్ని వీక్షించి ప్రజలు పులకించిపోయారు. కొన్ని చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో జనం సూర్యగ్రహణాన్ని చూశారు. గ్రహణం విడిచిన తర్వాత మూసివుంచిన ఆలయాలను ఒక్కొక్కటిగా తెరిచారు. 
 
6:32 PM IST

తెలంగాణలో మిగిలిపోయిన ఇంజనీరింగ్ సీట్లు

తెలంగాణలో ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఈ విషయాన్ని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్. సీట్లు పొందిన విద్యార్ధులు ఈ నెల 28 నాటికి కాలేజీల్లో చేరాలని .. రాష్ట్రవ్యాప్తంగా 15,447 ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయాయని ఆయన తెలిపారు. 

5:40 PM IST

బండి సంజయ్ కారులో తనిఖీలు

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కారును ఆపి తనిఖీలు చేశారు పోలీసులు. ఇప్పటికే నిన్న కూడా సంజయ్ కారును తనిఖీ చేశారు పోలీసులు. గంటల వ్యవధిలోనే మూడుసార్లు ఆయన కారును తనిఖీ చేయడం గమనార్హం. 

4:00 PM IST

ఎల్లుండి నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

వచ్చే గురువారం (27వ తేదీ) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్ కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ ను సీఎం జాతికి అంకితం చేయనున్నారు. దీంతో 800 మెగావాట్ల యూనిట్ అందుబాటులోకి రానుంది. 

2:51 PM IST

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జ్వరం...నేడు మునుగోడులో ప్రచారానికి దూరం

మునుగోడు ఉపఎన్నికలో బిజెపి తరపున పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి ప్రచారం నిలిచిపోయింది. ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయనకు జ్వరం రావడంతో ఇవాళ అతడు చేపట్టాల్సిన ప్రచారం నిలిచిపోయింది. 

1:46 PM IST

దేశవ్యాప్తంగా నిలిచిన వాట్సాప్ సేవలు

దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవల్లో ఇబ్బందులు తలెత్తాయి. సాంకేతిక సమస్య కారణంగా వాట్సాప్ మెసేజ్ పంపడం సాధ్యంకావడం లేదు. సర్వర్ డౌన్ కావడంవల్లే సమస్య తలెత్తినట్లు మెటా సంస్థ ప్రకటించింది.

12:04 PM IST

టీ20 వరల్డ్ కప్ లో విండీస్ చెత్త ప్రదర్శన... హెడ్ కోచ్ సిమన్స్ రాజీనామా

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో వెస్టిండిస్ పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశనుండే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇలా విండీస్ పరాజయాలకు బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ రాజీనామా చేసారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సీరిస్ తర్వాత వెస్టిండిస్ జట్టుకు దూరం కానున్నట్లు కోచ్ ప్రకటించారు. 

11:18 AM IST

సిత్రాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ ... బెంగాల్, అసోంలో భారీ వర్షాలు

సిత్రాంగ్ తుఫాను ప్రభావంతో బంగ్లాదేశ్ అతలాకుతలం అవగా భారత్ లోని పశ్చిమ బెంగాల్, అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

10:14 AM IST

నేడు సూర్యగ్రహణమున్నా మూతపడని శ్రీకాళహస్తి ఆలయం... ప్రత్యేక పూజలు

ఇవాళ (మంగళవారం) సూర్యగ్రహణం సందర్భంగా తిరుమలతో పాటు విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, యాదాద్రి, వేములవాడ వంటి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడనున్నాయి. కానీ శ్రీకాళహస్తి దేవాలయంలో యధాతదంగా భక్తులకు అనుమతించనున్నారు. దర్శనంతో పాటు రాహు కేతు పూజలు కూడా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణ సమయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. 

9:23 AM IST

కోయంబత్తూరు కారు పేలుడు కేసు ... నలుగురు యువకులు అరెస్ట్

తమిళనాడు కోయంబత్తూరు కారు పేలుడు ఘటనతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. సిసి కెమెరాల ఆధారంగా మృతుడు జమిషా ముబీన్ తో పాటు పట్టుబడిన నలుగురు యువకులు పేలుడు పదార్థాలను తరలించినట్లు గుర్తించారు. దీంతో మహ్మద్ తల్క, మహ్మద్ అజారుద్దిన్, మహ్మద్ రియాజ్, ఫిరోజ్ ఇస్మాయిల్, మహ్మద్ నవాజ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు సమాచారం.  
 
9:17 AM IST

నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం... పది షాపులు దగ్దం

పల్నాడు జిల్లా నరసరావుపేటలో గత అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ దుకాణంలో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి క్రమంగా పక్కనున్న షాపులకు వ్యాపించాయి. అర్ధరాత్రి కావడంతో మంటలు ఉవ్వెత్తును ఎగసిపడేవరకు స్థానికులు గమనించలేదు. దీంతో పది షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసారు. 

10:13 PM IST:

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్‌ను సీమ టపాకాయ్ అనుకుంటే, ఆయన చీమ టపాకాయ్ అయ్యారని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఇక మంత్రులు , వైసీపీ నేతలు తారాజువ్వల్లాగా పైకి వెళ్లి కిందపడటం అలవాటుగా మారిపోయారని గోరంట్ల సెటైర్లు వేశారు. 
 
9:06 PM IST:

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని ఊరకలెత్తించనుంది. దీనిలో భాగంగా ఆ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 

8:15 PM IST:

వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించిందని కూతురిని కన్నతండ్రే దారుణంగా హతమార్చాడు. పెబ్బేరు మండలం పాతపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడ్డాడు.

7:21 PM IST:

తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం విడిచింది. ఆకాశంలో చోటు చేసుకున్న అద్భుతాన్ని వీక్షించి ప్రజలు పులకించిపోయారు. కొన్ని చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో జనం సూర్యగ్రహణాన్ని చూశారు. గ్రహణం విడిచిన తర్వాత మూసివుంచిన ఆలయాలను ఒక్కొక్కటిగా తెరిచారు. 
 
6:32 PM IST:

తెలంగాణలో ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఈ విషయాన్ని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్. సీట్లు పొందిన విద్యార్ధులు ఈ నెల 28 నాటికి కాలేజీల్లో చేరాలని .. రాష్ట్రవ్యాప్తంగా 15,447 ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయాయని ఆయన తెలిపారు. 

5:40 PM IST:

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కారును ఆపి తనిఖీలు చేశారు పోలీసులు. ఇప్పటికే నిన్న కూడా సంజయ్ కారును తనిఖీ చేశారు పోలీసులు. గంటల వ్యవధిలోనే మూడుసార్లు ఆయన కారును తనిఖీ చేయడం గమనార్హం. 

4:00 PM IST:

వచ్చే గురువారం (27వ తేదీ) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్ కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ ను సీఎం జాతికి అంకితం చేయనున్నారు. దీంతో 800 మెగావాట్ల యూనిట్ అందుబాటులోకి రానుంది. 

2:51 PM IST:

మునుగోడు ఉపఎన్నికలో బిజెపి తరపున పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి ప్రచారం నిలిచిపోయింది. ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయనకు జ్వరం రావడంతో ఇవాళ అతడు చేపట్టాల్సిన ప్రచారం నిలిచిపోయింది. 

1:51 PM IST:

దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవల్లో ఇబ్బందులు తలెత్తాయి. సాంకేతిక సమస్య కారణంగా వాట్సాప్ మెసేజ్ పంపడం సాధ్యంకావడం లేదు. సర్వర్ డౌన్ కావడంవల్లే సమస్య తలెత్తినట్లు మెటా సంస్థ ప్రకటించింది.

12:04 PM IST:

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో వెస్టిండిస్ పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశనుండే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇలా విండీస్ పరాజయాలకు బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ రాజీనామా చేసారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సీరిస్ తర్వాత వెస్టిండిస్ జట్టుకు దూరం కానున్నట్లు కోచ్ ప్రకటించారు. 

11:18 AM IST:

సిత్రాంగ్ తుఫాను ప్రభావంతో బంగ్లాదేశ్ అతలాకుతలం అవగా భారత్ లోని పశ్చిమ బెంగాల్, అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

10:14 AM IST:

ఇవాళ (మంగళవారం) సూర్యగ్రహణం సందర్భంగా తిరుమలతో పాటు విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, యాదాద్రి, వేములవాడ వంటి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడనున్నాయి. కానీ శ్రీకాళహస్తి దేవాలయంలో యధాతదంగా భక్తులకు అనుమతించనున్నారు. దర్శనంతో పాటు రాహు కేతు పూజలు కూడా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణ సమయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. 

9:23 AM IST:

తమిళనాడు కోయంబత్తూరు కారు పేలుడు ఘటనతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. సిసి కెమెరాల ఆధారంగా మృతుడు జమిషా ముబీన్ తో పాటు పట్టుబడిన నలుగురు యువకులు పేలుడు పదార్థాలను తరలించినట్లు గుర్తించారు. దీంతో మహ్మద్ తల్క, మహ్మద్ అజారుద్దిన్, మహ్మద్ రియాజ్, ఫిరోజ్ ఇస్మాయిల్, మహ్మద్ నవాజ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు సమాచారం.  
 
9:17 AM IST: