నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Tuesday 13th september telugu news live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
 
9:42 PM IST

పారిశ్రామిక వృద్ధిలో ఏపీ నెంబర్‌వన్

పారిశ్రామిక వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా నిలిచింది. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) రూపొందించిన నివేదికలో ఏపీకి అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. ఏపీ తర్వాత ఒడిశా నిలిచింది. 

8:59 PM IST

అయోధ్య రామాలయ నిర్మాణంలో ఏపీ గ్రానైట్

అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి చురుగ్గా సాగుతోంది. అయితే గర్భగుడితో పాటు ఐదు మంపాల నిర్మాణానికి సంబంధించి ఏపీలోని గ్రానైట్ రాళ్లను ఎంపిక చేశారు. నిర్మాణం కోసం ఏపీ , కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 17,000 గ్రానైట్ రాళ్లను వినియోగించినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. 

8:03 PM IST

ఒక్క రాజధానికే నిధులు

కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ రాజ‌ధాని విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చింది. మూడు రాజ‌ధానుల  విష‌యంలో ప్ర‌భుత్వానికి నిరాశ‌ను క‌లిగిస్తూ మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. కేవ‌లం ఒక్క రాజ‌ధానికే నిధులు కేటాయింపులు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో మూడు రాజ‌ధానుల అంశం మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. 
 
7:18 PM IST

షర్మిలపై స్పీకర్‌కు ఫిర్యాదు

వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, వైఎస్ షర్మిలపై ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వీరిలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు వున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం షర్మిలపై చర్చలు తీసుకునే అవకాశం వుందని న్యాయ నిపుణులు అంటున్నారు. 

6:48 PM IST

ధవళేశ్వరం వద్ద పెరుగుతోన్న గోదావరి ఉద్ధృతి

ధవళేశ్వరం దగ్గర గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం 12.6 అడుగులకు చేరింది నీటిమట్టం. 175 గేట్ల నుంచి 11,08,512 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. 
 
6:02 PM IST

అమరావతి భూ కుంభకోణంలో అరెస్ట్‌లు

అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబుగా గుర్తించారు. ఈ కుంభకోణంలో 1,100 ఎకరాల అసైన్డ్ భూములు చేతులు మారినట్లుగా తెలుస్తోంది.

11:50 AM IST

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతాకు కార్పోరేషన్ పదవి

తెలంగాణ హ్యాండ్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు నియమకానికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసారు. 
 
11:23 AM IST

భారత్ లో కరోనా తగ్గుముఖం... ఐదువేల దిగువకు రోజువారి కేసులు

భారత్ లో రోజువారి కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 4,369 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. తాజా కేసులకంటే కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్యే అధికంగా (5,178) వుంది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 46,347 కు చేరింది.  
 
10:26 AM IST

అసెంబ్లీ నుండి ఈటల రాజేందర్ సస్పెండ్...

ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి హాజరైన బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ అసెంబ్లీ సెషన్స్ మొత్తానికి ఈటలను సస్పెండ్ చేసారు. ఇటీవల అసెంబ్లీ స్పీకర్ పోచారంపై చేసిన వ్యాఖ్యలకు గాను ఈటలను సస్పెండ్ చేసారు. 
 
9:38 AM IST

సికింద్రాబాద్ అగ్నిప్రమాదంపై కేటీఆర్ విచారం... మృతుల ప్యామిలీకి రూ.3 లక్షల ఆర్థికసాయం

సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాద దుర్ఘటనపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పందించారు. అగ్నిప్రమాదంలో పలువురి సజీవదహనంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం మూడు లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. 

read more  సికింద్రాబాద్ లాడ్జీలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు: నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి

9:29 AM IST

Telugu News Live : సికింద్రాబాద్ అగ్నిప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి... ఎక్స్ గ్రేషియా ప్రకటన

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున కేంద్రం ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. 

read more సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ఏడుగురి మృతి.. పదిమందికి గాయాలు..

9:42 PM IST:

పారిశ్రామిక వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా నిలిచింది. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) రూపొందించిన నివేదికలో ఏపీకి అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. ఏపీ తర్వాత ఒడిశా నిలిచింది. 

8:59 PM IST:

అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి చురుగ్గా సాగుతోంది. అయితే గర్భగుడితో పాటు ఐదు మంపాల నిర్మాణానికి సంబంధించి ఏపీలోని గ్రానైట్ రాళ్లను ఎంపిక చేశారు. నిర్మాణం కోసం ఏపీ , కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 17,000 గ్రానైట్ రాళ్లను వినియోగించినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. 

8:03 PM IST:

కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ రాజ‌ధాని విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చింది. మూడు రాజ‌ధానుల  విష‌యంలో ప్ర‌భుత్వానికి నిరాశ‌ను క‌లిగిస్తూ మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. కేవ‌లం ఒక్క రాజ‌ధానికే నిధులు కేటాయింపులు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో మూడు రాజ‌ధానుల అంశం మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. 
 
7:18 PM IST:

వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, వైఎస్ షర్మిలపై ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వీరిలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు వున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం షర్మిలపై చర్చలు తీసుకునే అవకాశం వుందని న్యాయ నిపుణులు అంటున్నారు. 

6:48 PM IST:

ధవళేశ్వరం దగ్గర గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం 12.6 అడుగులకు చేరింది నీటిమట్టం. 175 గేట్ల నుంచి 11,08,512 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. 
 
6:02 PM IST:

అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబుగా గుర్తించారు. ఈ కుంభకోణంలో 1,100 ఎకరాల అసైన్డ్ భూములు చేతులు మారినట్లుగా తెలుస్తోంది.

11:50 AM IST:

తెలంగాణ హ్యాండ్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు నియమకానికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసారు. 
 
11:23 AM IST:

భారత్ లో రోజువారి కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 4,369 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. తాజా కేసులకంటే కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్యే అధికంగా (5,178) వుంది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 46,347 కు చేరింది.  
 
10:26 AM IST:

ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి హాజరైన బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ అసెంబ్లీ సెషన్స్ మొత్తానికి ఈటలను సస్పెండ్ చేసారు. ఇటీవల అసెంబ్లీ స్పీకర్ పోచారంపై చేసిన వ్యాఖ్యలకు గాను ఈటలను సస్పెండ్ చేసారు. 
 
9:45 AM IST:

సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాద దుర్ఘటనపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పందించారు. అగ్నిప్రమాదంలో పలువురి సజీవదహనంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం మూడు లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. 

read more  సికింద్రాబాద్ లాడ్జీలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు: నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి

9:32 AM IST: