తిరుపతి: కేంద్రం అనుమతిస్తే ఆనందయ్య మందు తయారీకి సిద్దంగా ఉన్నామని  టీటీడీ బోర్డు మెంబర్  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారంగానే మందును పంపిణీ చేస్తామన్నారు. తిరుపతిలోని ఆయుర్వేద కాలేజీలో ఆనందయ్య బంధువులు, శిష్యులతో టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం అనుమతులిస్తేనే మందు తయారీకి సిద్దంగా ఉన్నామన్నారు. కేంద్రం అనుమతిస్తే ఎన్ని లక్షల మందికైనా మందు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. వనమూలికలు ఎక్కడ ఉన్నాయో వివరాలు సేకరిస్తున్నామన్నారు.  సోషల్ మీడియాలో కామెంట్స్ కు తాము స్పందించబోమని ఆయన చెప్పారు. 

ఐదు రోజులుగా ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. జాతీయ ఆయుర్వేద సంస్థ ఆనందయ్య మందుపై పరిశోధిస్తోంది. ఆనందయ్య తీసుకొన్న మందు తీసుకొన్న వారి నుండి డేటా సేకరిస్తున్నారు. ఈ డేటా వచ్చిన  తర్వాత  క్లినికల్ ట్రయల్స్  చేయనున్నారు.