రాజ్‌ఘాట్‌లో  గాంధీ సమాధి వద్ద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు మంగళవారం నాడు ఉదయం నివాళులర్పించారు 


న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు మంగళవారం నాడు ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్ నుండి ట్రంప్ దంపతులు నేరుగా రాజ్ ఘాట్‌కు చేరుకొని మహాత్మాగాంధీ సమాధిపై పూలమాల వేసి నివాళులర్పించారు.

also read:రాష్ట్రపతి భవన్‌కు ట్రంప్ దంపతులు: త్రివిధ దళాల గౌరవ వందనం

Scroll to load tweet…

 రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధి వద్ద ట్రంప్ దంపతులు విజిటర్స్ బుక్‌లో తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ చిహ్నం ఉన్న ప్రతిమను అధికారులు ట్రంప్ దంపతులకు అందించారు.

గాంధీ ఆచరించిన అహంసా సిద్దాంతాల గురించి ట్రంప్ గతంలో ట్వీట్లు చేశారు. రాజ్ ఘాట్ వద్ద ట్రంప్ దంపతులు ఒ మొక్కను నాటారు. సోమవారం నాడు ఉదయం అహ్మదాబాద్‌ కు సమీపంలో గాంధీకి చెందిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు.మహాత్మాగాంధీ ఉపయోగించిన రాట్నం తో నూలు వడికారు. నూలు ఎలా వడికుతారో ట్రంప్ దంపతులు తెలుసుకొన్నారు.