Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ పర్యటన డే 2 లైవ్ అప్డేట్స్: రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు విందు, హాజరైన కేసీఆర్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిన్న తాజ్ మహల్ ని సందర్శించిన అనంతరం నైట్ ఢిల్లీలోని హోటల్ కు చేరుకున్నారు. అక్కడి నుండి ఆయన నేటి ఉదయం ఆయన రెండవ రోజు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేడు ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉండనుంది. 

Trump India Visit day2 : live updates
Author
New Delhi, First Published Feb 25, 2020, 10:14 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. దర్బార్ హాల్ వద్ద ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌ వివరాలను రామ్‌నాథ్ కోవింద్ వివరించారు.

అనంతరం రాష్ట్రపతి.. ట్రంప్ దంపతులు, అమెరికా ప్రతినిధులకు విందు ఇచ్చారు. ఈ సందర్భగా విందుకు హాజరైన కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ట్రంప్ పరిచయం చేసుకున్నారు. 

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశ సీఈఓలతో సమావేశమయ్యారు. టాటా సన్స్ చంద్రశేఖర్ నుండి మొదలుకొని అనేక కంపెనీల సీఈవోలు అమెరికాలో పెట్టుబడుల గురించి ట్రంప్ ముందు తమ ప్రశ్నలను, అనుమానాలను ఉంచారు. అందరి ప్రశ్నలకు ట్రంప్ సావధానంగా సమాధానమిచ్చారు. 

హైదరాబాద్ హౌస్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ల మధ్య చర్చలు ముగిసాయి. వారు జాయింట్ ప్రెస్ స్తతెమెంత్ ఇస్తూ... 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ తెలిపారు. దానితోపాటు వేరే మూడు ఒప్పందాలు కూడా కుదిరినట్టు తెలుస్తుంది. 

హ్యాపీనెస్ క్లాస్ ఎలా ఉందొ పూర్తిగా పరిశీలించిన తరువాత ఆమె అక్కడ చిన్న సందేశాన్ని చదివి వినిపించారు. గొప్ప టీచర్లు కేవలం అమెరికాలో మాత్రమే ఉండరని, ప్రపంచమంతా ఉంటారని తనకు అర్థమయినట్టు ఆమె తెలిపారు. 

మేలేనియ ట్రంప్ ఢిల్లీలోని సర్వోదయ స్కూల్ పర్యటనకు విచ్చేసారు. ఢిల్లీలో విద్యా విధానం ఎలా ఉందొ చూడడానికి ఆమె అక్కడకు వచ్చారు. హప్పినెస్స్ చ్లస్సెస్ ఏమిటో అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడి విద్యార్థులతో ఉపాధ్యాయులతో ఆమె చర్చించనున్నారు. 

ట్రంప్ రాజ్ ఘాట్ నుండి నేరుగా హైదరాబాద్ హౌస్ కి చేరుకున్నారు. అక్కడ ఆయన మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపి ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలను చేస్తారు. 

రాష్ట్రపతి భవన్ వద్ద గార్డ్ అఫ్ హానర్ ను స్వీకరించిన ట్రంప్ అక్కడి నుండి నేరుగా రాజ్ ఘాట్ ను సందర్శించారు. అక్కడ మహాత్మ గాంధీ సమాధి వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. ఆయనకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆత్మీయస్వాగతం పలికారు. ట్రంప్ తో పాటుగా ఫస్ట్ లేడీ మేలేనియా ట్రంప్ కూడా ఆయన వెంట ఉన్నారు. 

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులతో పాటుగా ప్రధాని మోడీ ఆయనతో కరచాలనం చేసిన తరువాత రాష్ట్రపతి భావం వద్ద గార్డ్ అఫ్ హానర్ స్వీకరించారు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిన్న తాజ్ మహల్ ని సందర్శించిన అనంతరం నైట్ ఢిల్లీలోని హోటల్ కు చేరుకున్నారు. అక్కడి నుండి ఆయన నేటి ఉదయం ఆయన రెండవ రోజు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేడు ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉండనుంది. 

అనేక కంపెనీల ప్రముఖులతో మీటింగ్ తో పాటుగా ఆయన భారత ప్రభుత్వంతో కూడా అనేక ద్వైపాక్షిక ఒప్పందాలపై కూడా సంతకం పెట్టనున్నారు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలేనియ ట్రంప్, కూతురు ఇవాంక, జారెడ్ కుష్ణర్ లతో కూడిన బృందంతో భారత్ లో దిగారు. ఆయన నేరుగా వాషింగ్టన్ నుండి బయల్దేరి అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. 

విమానాశ్రయం నుంచి నేరుగా సబర్మతి ఆశ్రమం చేరుకున్న ట్రంప్... అక్కడ గాంధీజీ ఆశ్రమాన్ని సందర్శించి రాట్నం కూడా తిప్పారు. మూడు కోతుల బొమ్మను చూసి ముగ్ధుడయ్యాడు ట్రంప్. 

అక్కడి నుండి అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ ఈవెంట్ లో పాల్గొన్నారు. భారత్, అమెరికాల మైత్రి లో నూతన అధ్యాయం ఆరంభమైందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ గొప్పతనాన్ని, మోడీ ఔచిత్యాన్ని పదే పదే ప్రస్తావిస్తూ... భారత్ అమెరికాకు మంచి మిత్ర దేశమని ఘంటాపథంగా తెలిపారు. 

అక్కడి నుండి ఆయన తాజ్ మహాయోల్ సందర్శనానికి వెళ్లారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్కడ ట్రంప్ కి స్వాగతం పలికారు. ఆగ్రా ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి తాజ్ మహల్ చేరుకున్న ట్రంప్ బృందం అక్కడ దాదాపుగా గంటసేపు గడిపారు. 

అక్కడి నుండి నిన్న రాత్రి ఢిల్లీ లోని మౌర్య షెరటాన్ హోటల్ కి బయల్దేరి వెళ్లారు. అక్కడే నిన్న రాత్రి బస చేసారు ట్రంప్. నేడు ట్రంప్ భారత్ తో అనేక ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటుగా అనేక కంపెనీల ప్రతినిధులతో కూడా మాట్లాడుతారు. ఆ తరువాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు హాజరయి రాత్రి అమెరికా పయనమైపోతారు. 

Follow Us:
Download App:
  • android
  • ios