డబ్బును తరలిస్తున్న ట్రక్కుకు మంటలు అంటుకోవడంతో కోట్లాది రూపాయాల నోట్లు కాలి బూడిదగా మారాయి. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
శ్రీనగర్: డబ్బును తరలిస్తున్న ట్రక్కుకు మంటలు అంటుకోవడంతో కోట్లాది రూపాయాల నోట్లు కాలి బూడిదగా మారాయి. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
జమ్మూ కాశ్మీర్‌లో అనంతనాగ్ జిల్లా ఖాజిగంద్ ప్రాంతంలోని పంజాత్‌లో సోమవారం తెల్లవారుజామున మధ్య రాత్రి ఘటన చోటు చేసుకొంది. లోకల్ టీవీ చానెళ్లలో ఈ విషయం ప్రసారమైంది. కోట్లాది రూపాయాల నోట్ల కట్టలను తరలిస్తున్న ట్రక్కు దగ్దం కావడం చర్చనీయాంశంగా మారింది.
ట్రక్కులో రూ. 500 నోట్ల కట్టలున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం దృష్టికి పోలీసులు ఈ ఘటనను తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 22, 2019, 6:28 PM IST