Asianet News TeluguAsianet News Telugu

కొత్త జోన్లకు మోడీ సానుకూలం: టీఆర్ఎస్ ఎంపీలు

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను ఇవ్వాలని  ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు.గురువారం నాడు పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు మోడీని కలిసి వినతిపత్రం సమర్పించారు.

TRS mp's meets primeminister modi
Author
New Delhi, First Published Aug 10, 2018, 1:13 PM IST


న్యూఢిల్లీ: తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను ఇవ్వాలని  ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు.గురువారం నాడు పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు మోడీని కలిసి వినతిపత్రం సమర్పించారు.

టీఆర్ఎస్ ఎంపీలు గురువారం నాడు ప్రధానమంత్రి మోడీని కలిశారు. కొత్త సచివాలయం నిర్మాణం కోసం  అవసరమైన  రక్షణ శాఖ భూములను ఇవ్వాలని కోరారు.రక్షణ శాఖ భూములను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడ  ఆ మేరకు  భూములను కేటాయించనుందని గతంలోనే తెలంగాణ సర్కార్  కేంద్రానికి చెప్పింది.

ఈ విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు మోడీని కోరారు.మరో వైపు కొత్త జోన్ల విషయమై కూడ నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రి మోడీని కోరారు.  ఇదే విషయమై  ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ ప్రధానితో చర్చించారు.

ఈ రెండు విషయాలపై ప్రధానమంత్రి మోడీ సానుకూలంగా స్పందించారని టీఆర్ఎస్ ఎంపీలు  చెప్పారు. మోడీతో సమావేశం ముగిసిన తర్వాత టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు  జితేందర్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ వినోద్‌లు మీడియాకు వివరించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios