త్రిపుర :  అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్ మంజూరుకు నోచుకోని ఎమ్మెల్యే ధనుంజోయ్ ఎట్టకేలకు తన పంతం వీడారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కేసు పెట్టిన మహిళనే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యారు. 

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. త్రిపుపరలోని రిమా వ్యాలీ ఐపీఎఫ్టీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధనుంజోయ్ పై ఓ మహిళ ఈ ఏడాది మే 20న అగర్తలలోని మహిళా పీఎస్ లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. 

గత కొంతకాలంగా తనతో సన్నిహితంగా ఉంటూ వచ్చిన ఎమ్మెల్యే పెళ్లి అనేసరికి ప్లేటు ఫిరాయించడాని ఆరోపించింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేపట్టిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరుకు దరఖాస్తు చేసుకున్నారు ఎమ్మెల్యే ధనుంజోయ్. 

ముందస్తు బెయిల్ కు కోర్టు తిరస్కరించడతో చేసేది లేక రాజీకొచ్చారు. ఆరోపణలు చేసిన మహిళనే వివాహం చేసుకున్నారు. ఆదివారం ఇరుకుటుంబాల సభ్యులతోపాటు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 

ఈ సందర్భంగ ఎమ్మెల్యే తరపున న్యాయవాది మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఆయన భార్య రాజీకి వచ్చారని ఇద్దరు వివాహం చేసుకున్నారని తెలిపారు. భవిష్యత్ లో ఎలాంటి ఫిర్యాదులు చేసుకోకూడదని ఒప్పందానికి వచ్చారని స్పష్టం చేశారు. చేసుకున్నారు.