Asianet News TeluguAsianet News Telugu

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్‌కు కరోనా పాజిటివ్

కరోనా వైరస్‌ దేశంలో తీవ్రరూపు దాల్చుతోంది. రోజుకు లక్ష తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా మరో ముఖ్యమంత్రికి పాజిటివ్‌గా తేలింది. 

tripura cm biplab kumar deb tested corona positive ksp
Author
Agartala, First Published Apr 7, 2021, 8:58 PM IST

కరోనా వైరస్‌ దేశంలో తీవ్రరూపు దాల్చుతోంది. రోజుకు లక్ష తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా మరో ముఖ్యమంత్రికి పాజిటివ్‌గా తేలింది.

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌కు కరోనా సోకింది. తాజాగా ఆయనకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌‌గా తేలినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు విప్లవ్ కుమార్ వెల్లడించారు.

ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. 

కాగా, దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. మంగళవారం ఒక్కరోజే లక్ష 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అటు  మృతుల సంఖ్య భారీగా ఉంటోంది. దీంతో పలు రాష్ట్రాలు, ప్రాంతాల్లో తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించగా.. పంజాబ్ సైతం రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios