Asianet News TeluguAsianet News Telugu

త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌లు: ఇంటింటి ప్ర‌చారం ప్రారంభించిన బీజేపీ నేత‌, రాష్ట్ర సీఎం మాణిక్ సాహా

Agartala: రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త్రిపుర ముఖ్యమంత్రి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ క్లీన్ ఇమేజ్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి మాణిక్ స‌హా వ్యాఖ్యానించారు. మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 
 

Tripura Assembly Elections: BJP leader and state CM Manik Saha started door-to-door campaigning
Author
First Published Jan 20, 2023, 4:11 PM IST

Tripura Assembly Elections:  త్రిపుర అసెంబ్లీకి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఈ క్ర‌మంలోనే  అన్ని రాజ‌కీయ పార్టీల్ని ముమ్మరంగా ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నాయి. అధికార పార్టీ బీజేపీ సైతం మ‌రోసారి అధికార పీఠం ద‌క్కించుకోవ‌డానికి వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త్రిపుర ముఖ్యమంత్రి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ క్లీన్ ఇమేజ్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి మాణిక్ స‌హా వ్యాఖ్యానించారు.

వివ‌రాల్లోకెళ్తే.. త్రిపురలో త్వరలో అసెంబ్లీ ఎన్నిక‌లు జరగనున్న క్ర‌మంలో ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా పాలుపంచుకున్నారు. ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించి.. బీజేపీ పాల‌న అభివృద్దిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. బీజేపీకి ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో భారీ అభివృద్ధిని సాధించామని పేర్కొంటూ ఇంటింటి ప్ర‌చారం ప్రారంభించిన బీజేపీ మ‌రోసారి తాము అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. త్రిపురలో అన్ని రంగాల్లో భారీ అభివృద్ధి సాధించామన్నారు. అందుకే ప్రత్యర్థులకు సరైన సమస్య లేదు.. మ‌రోసారి ప్ర‌జ‌లు బీజేపీకి ప‌ట్టం క‌డ‌తారు అని మాణిక్ సాహా అన్నారు.

 

పోలింగ్ తేదీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య జరిగిన రాజకీయ ఘర్షణలను  మాణిక్ సాహా ప్రస్తావిస్తూ, మజ్లీష్ పూర్ సంఘటనలు ఉద్దేశించబడినవి కావు. కానీ ప్రతిపక్షాలు తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు సమస్యను సృష్టించాలని చూస్తున్నాయని ఆరోపించారు.  త్రిపురలోని మజ్లీష్ పూర్ లో బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన అరగంటకే ఈ ఘర్షణ చోటు చేసుకుంది.

కాగా, బీజేపీ ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన లభిస్తోందని ముఖ్యమంత్రి మాణిక్ సాహా అన్నారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ గత రెండు రోజులుగా ఇంటింటి ప్రచారం ప్రారంభించామన్నారు. ఓటర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని చెప్పారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు ఉన్నాయనీ, దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోడీపై, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై వారికి విశ్వాసం ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ క్లీన్ ఇమేజ్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇంతకాలం త్రిపురలో కుస్తీ, ఢిల్లీలో స్నేహాన్ని రాష్ట్ర ప్రజలు చూశారని కాంగ్రెస్-సీపీఎం కూటమిపై మండిపడ్డారు. ఇప్పుడు త్రిపురలోనూ స్నేహం మొదలుపెట్టి సామాన్యులకు ద్రోహులుగా పేరు తెచ్చుకున్నార‌ని విమ‌ర్శించారు. ఆయా ప‌రిస్థితులను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌నీ, ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులకు సున్నా సీట్లే వ‌స్తాయ‌ని అన్నారు. 

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ 50కి పైగా సీట్లు గెలుచుకుని మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాణిక్ సాహా ధీమా వ్య‌క్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని యాభై ఏళ్లుగా ప్రజల డిమాండ్ ఉందనీ, ప్రస్తుత ప్రభుత్వం డ్రెయిన్ నిర్మించి వారి డిమాండ్ ను నెరవేర్చిందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios