Agartala: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ మేనిఫెస్టోలో ప్రాథమిక అభివృద్ధికి సంబంధించి అనేక హామీలు ఇచ్చే అవ‌కాశ‌ముంది.

Tripura Assembly Elections: ఈశాన్య భార‌త రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రాంతంలోని అన్ని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం నాడు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ మేనిఫెస్టోలో ప్రాథమిక అభివృద్ధికి సంబంధించి అనేక హామీలు ఇచ్చే అవ‌కాశ‌ముంది.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం (ఫిబ్రవరి 9) మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కొత్త లక్షణాలను జోడించడానికి తమ మేనిఫెస్టో పనిచేస్తుందని బీజేపీ పేర్కొంది. 

Scroll to load tweet…

బీజేపీ మేనిఫెస్టోలో.. 

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి గురించి కేంద్రం ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచిస్తోందని బీజేపీ నేత ఒకరు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, మరీ ముఖ్యంగా యువత అభివృద్ధే ఆయన దార్శనికతని తెలిపారు. మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతలు, మహిళలపై దృష్టి సారించి త్రిపుర సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు. దీనికి సంబంధించిన విష‌యాలు మేనిఫెస్టోలో ఉంటాయ‌ని పేర్కొన్నారు.

బీజేపీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉదయం త్రిపుర సుందరి మాండియాలో ప్రార్థనలు చేసి, ఆపై అగర్తలాలో మ్యానిఫెస్టోను విడుదల చేస్తారు. అనంత‌రం అక్క‌డ జ‌రిగే రోడ్‌షో లో పాలుగొంటారు. ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

త్రిపురలో ఎన్నికలు ఎప్పుడంటే..?

త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుండగా, మార్చి 2న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 259 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధికంగా 55 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. సీపీఎంకు 43 మంది, టీఎంసీకి 42, టీఎంసీకి 28, కాంగ్రెస్ 13, బీజేపీ మిత్రపక్షమైన ఐపీఎఫ్టీకి 6, సీపీఐ, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ కు చెరో అభ్యర్థి ఉన్నారు.

బీజేపీ అగ్రనేతల ఎన్నికల ప్రచారం.. 

త్రిపుర ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

Scroll to load tweet…