Asianet News TeluguAsianet News Telugu

త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌లు: రాష్ట్రంలోని రెండు చోట్ల నేడు అమిత్ షా ఎన్నికల ప్రచార రోడ్‌ షో

Agartala: ఈశాన్య భార‌త రాష్ట్రమైన త్రిపురలో సోమ‌వారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప‌ర్య‌టించ‌నున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న అక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌చార రోడ్ షో లో పాలుపంచుకోనున్నారు. ఖోవాయి జిల్లాలోని ఖోవాయి, దక్షిణ త్రిపుర జిల్లాలోని శాంతిర్‌బజార్‌లో నిర్వహించే రెండు ఎన్నికల ర్యాలీలలో అమిత్ షా ప్రసంగించనున్నారు.
 

Tripura Assembly Elections: Amit Shah roadshow today in two places in the state
Author
First Published Feb 6, 2023, 10:37 AM IST

Tripura Assembly Elections-Amit Shah: ఈశాన్య భార‌త రాష్ట్రమైన త్రిపురలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌రప‌డుతుండ‌టంతో అన్ని రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి. మ‌రోసారి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ఆ పార్టీ అగ్ర‌నేత‌ల‌ను బీజేపీ రంగంలోకి దింపుతోంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం త్రిపుర‌కు వ‌చ్చారు. అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న అక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌చార రోడ్ షో లో పాలుపంచుకోనున్నారు. ఖోవాయి జిల్లాలోని ఖోవాయి, దక్షిణ త్రిపుర జిల్లాలోని శాంతిర్‌బజార్‌లో నిర్వహించే రెండు ఎన్నికల ర్యాలీలలో అమిత్ షా ప్రసంగించనున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం త్రిపురలో రెండు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. ఖోవాయి జిల్లాలోని ఖోవాయి, దక్షిణ త్రిపుర జిల్లాలోని శాంతిర్‌బజార్‌లో రెండు ఎన్నికల ర్యాలీలలో షా ప్రసంగిస్తారు. సోమ‌వారం అగర్తల నగరంలో జరిగే రోడ్ షోలో కేంద్ర మంత్రి కూడా పాల్గొననున్నారు. షా రాష్ట్రానికి రాకముందు, త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా శనివారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అమిత్ షా ఫిబ్రవరి 6 ర్యాలీ కోసం సన్నాహాలను పరిశీలించారు. ఏర్పాట్ల‌లో ఎలాంటి లోపం ఉండ‌కుండా చూసేందుకు ముఖ్యమంత్రి దక్షిణ త్రిపురలోని శాంతిర్‌బజార్, ఖోవాయి జిల్లాలోని ఖోవాయి వద్ద ర్యాలీ స్పాట్‌లను సందర్శించారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల కంచుకోట అయిన త్రిపురలో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించి అధికారం ద‌క్కించుకుంది. ఎన్నికల విజయం తర్వాత, త్రిపుర ముఖ్యమంత్రిగా  బీజేపీ నాయ‌కుడు బిప్లబ్ దేబ్ ఉన్నారు. అయితే, మే 2022లో ఆ సీఎం ప‌ద‌వి నుంచి ఆయ‌న‌ను తొల‌గించి మాణిక్ సాహాను సీఎం కూర్చీని కూర్చోబెట్టారు. ఈ ఏడాదిలో కేంద్ర హోంమంత్రి రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి. అంతకుముందు జనవరి 5న, ఆయ‌న రెండు రథయాత్రల ప్రారంభోత్స‌వాల‌కు హాజరయ్యారు. ఒకటి ఉత్తర త్రిపురలోని ధర్మనగర్ నుండి, మరొకటి దక్షిణ త్రిపురలోని సబ్రూమ్ నుండి ప్రారంభమైన బీజేపీ ప్రచార యాత్ర‌ల్లో పాలుపంచుకున్నారు. 

ఇటీవల, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. గోమతి జిల్లాలోని అమర్‌పూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో కూడా ప్రసంగించారు. త్రిపురలో మరో విజయాన్ని నమోదు చేసేందుకు పార్టీ సిద్ధమవుతోంద‌నీ, ఐదు అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిన మాజీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT)తో పొత్తు పెట్టుకుందని తెలిపారు. కాగా, ఫిబ్రవరి 17న జరగనున్న ఈశాన్య రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 55 మంది అభ్యర్థులను నిలబెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నుండి వచ్చిన మాజీ సిఎం మాణిక్ సర్కార్ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈశాన్య రాష్ట్రంలో పలువురు బీజేపీ నేతలు కూడా ప్రచారం చేస్తారని పార్టీ అధికారులు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా 11 మంది మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు లభించడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios