Agartala: భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన 10 మంది రోహింగ్యాలతో సహా 13 మందిని అగర్తల రైల్వే స్టేషన్ లో అరెస్టు చేశారు. అరెస్టయిన 13 మంది అగర్తలా రైల్వే స్టేషన్ లో కోల్ కతా వెళ్లే కంచన్ జంగా ఎక్స్ ప్రెస్ కోసం ఎదురు చూస్తున్నారని జీఆర్పీ పోలీసు సూపరింటెండెంట్ అమితాబ్ పాల్ తెలిపారు.

Tripura Police: త్రిపురలోని అగర్తల రైల్వే స్టేషన్ లో 10 మంది రోహింగ్యా శరణార్థులను పోలీసులు అరెస్టు చేశారు. భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన 10 మంది రోహింగ్యాలతో సహా 13 మందిని అగర్తల రైల్వే స్టేషన్ లో అరెస్టు చేసిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అరెస్టయిన 13 మంది అగర్తలా రైల్వే స్టేషన్ లో కోల్ కతా వెళ్లే కంచన్ జంగా ఎక్స్ ప్రెస్ కోసం ఎదురు చూస్తున్నారని జీఆర్పీ పోలీసు సూపరింటెండెంట్ అమితాబ్ పాల్ తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. అగర్తలా రైల్వే స్టేషన్ లో 10 మంది రోహింగ్యా శరణార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు ఇద్దరు బంగ్లాదేశీయులను, ఒక భారతీయ హ్యాండ్లర్ ను కూడా అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ క్యాంపు నుంచి పారిపోయి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినట్లు విచారణలో రోహింగ్యాలు అంగీకరించినట్లు రైల్వే పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అరెస్టయిన 13 మంది కోల్ కతా వెళ్లేందుకు కంచన్ జంగా ఎక్స్ ప్రెస్ కోసం ఎదురు చూస్తున్నారని జీఆర్ పీ పోలీసు సూపరింటెండెంట్ అమితాబ్ పాల్ తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఈ అంశంపై పూర్తి విచార‌ణ జ‌రుగుతున్న‌ద‌ని తెలిపారు. 

ఇప్పటివరకు 33 మంది రోహింగ్యాల అరెస్టు

ఈ 13 మంది అరెస్టులతో అగర్తలా రైల్వే స్టేషన్ లో ఇప్పటివరకు 33 మంది రోహింగ్యాలను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఇందులో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రోహింగ్యా చొరబాటుదారులు సిపాయి జాలా జిల్లాతో అంతర్జాతీయ సరిహద్దు గుండా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారు. అక్ర‌మ చొర‌బాట్లను అడ్డుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న ఆగ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి కట్టుదిట్టమైన నిఘా పెట్టారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికలకు 48 గంటల ముందు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేశారు. అయినా అక్రమ చొరబాట్లు ఎలా సాగుతున్నాయో! దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనేది బహిరంగ ప్రశ్న.