Asianet News TeluguAsianet News Telugu

ట్రిపుల్ తలాక్ పై కేంద్రం ఆర్డినెన్స్

విపక్షాల అడ్డంకుల్ని అధిగమించాలంటే, రాజ్యసభతో సంబంధం లేకుండా ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రతిపాదించిన బిల్లులో కొన్ని సవరణలు చేయాలని విపక్షాలతోపాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైన  కూడా పట్టుబట్టాయి. 

Triple Talaq To Be An Offence, Cabinet Clears Executive Order
Author
Hyderabad, First Published Sep 19, 2018, 12:41 PM IST

ట్రిపుల్ తలాక్ పై ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివాదస్పద ముస్లిం విడాకులు ట్రిపుల్ తలాక్ పై కేంద్రం ఓ బిల్లును రూపొందించిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు గత డిసెంబరు 27 న లోక్ సభలో ఆమోదం లభించినా, రాజ్యసభలో మాత్రం ఆటంకాలు తప్పలేదు. పెద్దల సభలో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు 2017కు మోక్షం లభించలేదు.

ఈ బిల్లుకు విపక్షాలు మోకాళ్లు అడ్డటంతో ఆర్డినెన్స్ తేనున్నట్లు కేంద్రం తెలిపింది. విపక్షాల అడ్డంకుల్ని అధిగమించాలంటే, రాజ్యసభతో సంబంధం లేకుండా ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే కేంద్రం ప్రతిపాదించిన బిల్లులో కొన్ని సవరణలు చేయాలని విపక్షాలతోపాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు  కూడా పట్టుబట్టాయి. 

 కేంద్రం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా మారితే భార్య అనుమతి లేకుండా మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం నేరమవుతుంది. వీరికి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అవుతుంది. అంతేకాదు మైనర్ పిల్లలు ఉంటే వారి సంరక్షత బాధ్యతను కూడా తండ్రే నిర్వహించాల్సి ఉంటుంది. దీంతోపాటు మూడేళ్ల జైలు శిక్షకు కూడా అర్హులు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios